← Back to news

ఇంటి తాళం పగలగొట్టి బంగారం చోరీ

By Jelandharkoti Koti· 29 Aug 2026
ఇంటి తాళం పగలగొట్టి బంగారం చోరీ

TG: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పాత వరిపేటలో దొంగలు ఇంటి తాళం పగలగొట్టి 7.5 గ్రాముల బంగారం చోరీ చేశారు. గ్రామానికి చెందిన రాజు ఈ నెల 26న కుటుంబ సభ్యులతో కలిసి జైపూర్‌లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బీరువాను పరిశీలించగా అందులో ఉంచిన 7.5 గ్రాముల బంగారం కనిపించలేదు. దీంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

More in Local