Local

బెల్ట్ షాపుల నియంత్రణకు గ్రామపంచాయతీ తీర్మానం
Local· 3h ago

బెల్ట్ షాపుల నియంత్రణకు గ్రామపంచాయతీ తీర్మానం

TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్‌పూర్‌లో అక్రమ బెల్ట్‌ షాపుల నియంత్రణకు గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయించే కేంద్రాలపై నిఘా ఏర్పాటు చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మాన ప్రతిని ఎస్సై సైదులుకు అందజేశారు. బెల్ట్‌ షాపుల కారణంగా మహిళలు, యువత ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని సర్పంచ్ మేడిపల్లి ప్రియా చంద్రశేఖర్ తెలిపారు. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు.