Parenting· 1d ago
పిల్లలు అతిగా తీపి తింటున్నారా
పిల్లలు అతిగా చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్క్రీమ్స్ వంటివి తింటే బరువు పెరగడం, పళ్ళ సమస్యలు, నీరసం వంటివి వస్తాయి. ఈ అలవాటును మాన్పించడానికి తీపి పదార్థాల్ని వారికి దగ్గర్లో ఉంచకండి, కనిపించకుండా చెయ్యండి. స్వీట్లకు బదులు తాజా పండ్లు, ఖర్జూరం, కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్, ఇంట్లో చేసిన బెల్లం లడ్డూలు అలవాటు చెయ్యండి. పిల్లల ఆహారంలో ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటే, చిరుతిళ్లకు దూరంగా ఉంటారు. ప్రైజ్గా స్వీట్లు, చాక్లెట్లు ఇవ్వొద్దు. పిల్లల ముందు పెద్దలు తీపి తినకుండా కంట్రోల్ చేసుకోవాలి.