Motivational· 2 Oct 2026
సింపుల్ జీవితం.. అదే గాంధీజీ లైఫ్ స్టైల్
ఇప్పుడు మినిమలిజం, డిక్లటరింగ్, సింపుల్ లివింగ్ ట్రెండ్ అవుతున్నాయి. అంటే తక్కువ ఖర్చుతో నిరాడంబరంగా జీవించడం. 100 ఏళ్ల క్రితమే గాంధీ ఇలాంటి లైఫ్‌స్టైల్ ఫాలో అయ్యారు. ధోతీ, శాలువా, చెప్పులు, కళ్లద్దాలు, వాచీ.. అంతే! అయితే సింపుల్ లైఫ్ అంటే తక్కువ వస్తువులు ఉండటం మాత్రమే కాదు, మనకి ఏం అవసరమో ఆలోచించడం. ఖరీదైన బట్టలు, ఆడంబరాలకు దూరంగా ఉంటూ గాంధీ ఖాదీని ప్రోత్సహించారు. అవసరమైన వాటితో నలుగురికి ఉపయోగపడేలా జీవించడం నేర్పించారు.