Latest
Read all
మల్దకల్లో బీఆర్ఎస్ వంటావార్పు
Local · 8m ago
డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime · 8m ago
సూరసముద్రం చెరువు పరిరక్షణకు చర్యలు
Local · 12m ago
బెల్ట్ షాపుల నియంత్రణకు గ్రామపంచాయతీ తీర్మానం
Local · 22m ago
70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
Local · 28m ago
రోజూ న్యూడుల్స్ తింటున్నారా?
Health · 31m ago
గద్వాలను కరువు జిల్లాగా ప్రకటించాలి: CPM
Local · 34m ago
సంక్షేమమే మా టార్గెట్ : వినయ్‌రెడ్డి
Local · 40m ago
భారత్ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందా?
National · 41m ago
కర్రెగుట్టల్లో IED బ్లాస్ట్.. గిరిజనుడు మృతి
TG · 47m ago
FCRA సవరణ బిల్లు పరిశీలనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)
National · 50m ago
షాద్‌నగర్‌లో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
Local · 50m ago
బర్త్‌డే పేరుతో NRI కిడ్నాప్
Crime · 52m ago
ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోంది
Local · 1h ago
జాబ్ మారేటప్పుడు.. EPFO చెక్ చేసుకోండి!
Infotainment · 1h ago
అసెంబ్లీలో మా సమస్యలు చర్చించండి
Local · 1h ago
CM ప్రకటనలు చూస్తే తుగ్లక్ కూడా సిగ్గుపడతాడు: కవిత
TG · 1h ago
‘మీ కోసమే తీస్తున్నాం’.. మేకర్స్ కామెంట్స్‌పై తాప్సీ ఫైర్!
Entertainment · 1h ago
అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన
Local · 1h ago
మేళ్లగూడలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన
Local · 1h ago
SIR న్యాయబద్ధం కాదు: అశోక్ లవాసా
National · 1h ago
Top Stories
Education· 18h agoనిద్రలో మన శరీరం ఏం చేస్తుందో తెలుసా? 😴
మనకు నిద్ర అంటే రోజంతా చేసిన పనికి ఒక బ్రేక్‌లా అనిపిస్తుంది.. కానీ మనం నిద్రలోకి జారుకున్న వెంటనే శరీరం మాత్రం మరో షిఫ్ట్ మొదలుపెడుతుంది. మెదడు రోజంతా వచ్చిన సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూ జ్ఞాపకాలను బలపరుస్తుంది. శరీరం కణజాలాల రిపేర్, హార్మోన్ల సమతుల్యత వంటి కీలక పనులను కొనసాగిస్తుంది. ఇదే సమయంలో గుండె వేగం, శ్వాస నెమ్మదిస్తాయి. అంటే నిద్రలో శరీరం లోపల రిపేర్, రీసెట్ పనులు జరుగుతూ ఉంటాయి. అందుకే మంచి నిద్ర మన మెదడు, శరీరాన్ని మరుసటి రోజుకు ఫ్రెష్‌గా సిద్ధం చేస్తుంది.
Latest
Read allShorts
See all →Infographics
See all →
కర్రెగుట్టల్లో IED బ్లాస్ట్.. గిరిజనుడు మృతి
TG: ములుగు జిల్లా కర్రెగుట్టల్లో మావోయిస్టులు పెట్టినట్లు అనుమానిస్తున్న IED (ప్రెషర్ బాంబు) పేలడంతో ఓ గిరిజనుడు మృతి చెందాడు. నూగూరు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు మరో ఐదుగురితో కలిసి వెదురుబొంగుల కోసం అడవికి వెళ్లారు. తిరిగి వస్తుండగా IEDపై కాలు పడటంతో బ్లాస్ట్ జరిగింది. గాయపడిన నాగేశ్వరరావును తోటి వారు గ్రామానికి తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే చనిపోయారు. సెప్టెంబర్ 2న ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

CM ప్రకటనలు చూస్తే తుగ్లక్ కూడా సిగ్గుపడతాడు: కవిత
TG: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు చూస్తుంటే తుగ్లక్ కూడా సిగ్గుపడతాడని తెలంగాణ రక్షణ సేన నేత కవిత హాట్ కామెంట్స్ చేశారు. CM అనౌన్స్మెంట్స్కి, Govt. డిపార్ట్మెంట్స్ డెసిషన్స్‌కి పొంతన లేకుండా పోయిందన్నారు. ఇంటర్ అడ్మిషన్లు ఈ ఏడాది నుంచి ఉండవని CM చెబుతుంటే.. రెండు రోజుల్లో అడ్మిషన్లు అంటూ ఇంటర్ బోర్డు ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రంలోని మేధావులు, స్టేక్‌హోల్డర్స్‌తో చర్చించాలని సూచించారు. అలా చేస్తేనే డిగ్నిటీ ఉన్న నాయకుడిగా సీఎం నిలుస్తారని అన్నారు.

తెలంగాణలో రేపు మంత్రివర్గ విస్తరణ?
TG: తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంతో కేబినెట్లో ఖాళీ అయిన మూడు స్థానాలను భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు(ఆదివారం) మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన రానుందని, విజయశాంతి, మహేష్ గౌడ్, ప్రసాద్ కుమార్‌లకు కేబినెట్లో అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది.

నా పేరుతో ఫేక్ పోస్టులు.. కొండా సురేఖ క్లారిటీ
TG: కొండా సురేఖ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, పోస్టులపై ఆమె క్లారిటీ ఇచ్చారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన పేరుతో వైరల్ అవుతున్న పోస్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని <a href="https://x.com/iamkondasurekha/status/2095786135930966234">'X' పోస్ట్</a> చేశారు. తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలను షేర్ చేశారు. మీడియా, ప్రజలు తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కేవలం ఆ అఫీషియల్ అకౌంట్లనే ఫాలో అవ్వాలని కోరారు.

‘Gen Z’పై ఫోకస్ చేయండి.. మంత్రులతో చంద్రబాబు
AP: వెలిగొండ, పోలవరం లెఫ్ట్ కెనాల్‌కు నీరు ఇవ్వడంపై CM చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజినీరింగ్ అధికారులను అభినందించారు. మంత్రులంతా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాలని అన్నారు. Gen Z సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉందని, వారికి మన పనులను రీచ్ చేయాలని చెప్పారు. YSRCP చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిచేసిన క్రెడిట్ కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు.

కొత్త పింఛన్లు, లోకల్ ఎన్నికలపై లోకేశ్ ఫోకస్!
AP: TDP మంత్రులతో మంత్రి నారా లోకేశ్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. కొత్త పింఛన్లు, లోకల్ ఎలక్షన్స్ పై మాట్లాడారు. అర్హులైన వారికి అక్టోబర్ నుంచి ఫేజ్‌ల వారీగా కొత్త పింఛన్లు ఇవ్వాలని మంత్రులతో అన్నారు. పెండింగ్ అప్లికేషన్లను ఫాస్ట్‌గా క్లియర్ చేయాలని చెప్పారు. అక్టోబర్‌లోగా ఎన్నికల ప్రాసెస్ పూర్తి చేస్తామని, వాయిదా ఛాన్స్ లేదని క్లారిటీ ఇచ్చారు. ముందుగా మున్సిపల్, MPTC, ZPTC, చివరగా పంచాయతీ ఎన్నికలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

IIT, NIT తరహాలో మౌలిక వసతులు: లోకేశ్
AP: రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలోని JNTU ఇంజినీరింగ్ కళాశాలలో నూతన హాస్టళ్లను ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. IITలు, NITల తరహాలో ఆధునిక మౌలిక వసతులు, ప్రయోగశాలలు, నైపుణ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి ఎకరాకు సాగునీరు.. ఇదే లక్ష్యం: చంద్రబాబు
AP: గోదావరి, కృష్ణా నదులను రాష్ట్రంలోని అన్ని నదులతో అనుసంధానించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని CM చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమకాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వచ్చే ఏడాది నాటికి గోదావరి జలాలను సింహాద్రి అప్పన్న పాదాల చెంతకు తీసుకువెళ్తామని CM తెలిపారు.
Infotainment
See all →
జాబ్ మారేటప్పుడు.. EPFO చెక్ చేసుకోండి!
Job మారే టైంలో ఈపీఎఫ్‌వో(EPFO) రూల్స్‌పై ఎంప్లాయిస్ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొత్త కంపెనీలో చేరే ముందు UAN యాక్టివ్‌గా ఉందో లేదో సరిచూసుకోవడంతోపాటు Bank, PAN వివరాలు అప్డేట్ అయ్యాయో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. పాత కంపెనీకి సంబంధించిన 'Date of exit ' నమోదైతేనే పీఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. కొత్త జాబ్‌లో చేరాక పాత నిధులను కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల పెన్షన్ సర్వీస్ కంటిన్యూటీతోపాటు వడ్డీ నష్టం జరగకుండా ఉంటుంది.

సికింద్రాబాద్-సిర్పూర్‌కు రెండు స్పెషల్ ట్రైన్లు
ప్రయాణికులకు South Central Railway గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రెండు జనసాధారణ్ Unreserved స్పెషల్ ట్రైన్లు నడపనుంది. ఈరోజు నుంచి ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. 07235 ట్రైన్ మ. 12:10కి సికింద్రాబాద్‌లో బయలుదేరి సా. 5:30కి సిర్పూర్ చేరుతుంది. 07236 ట్రైన్ సా. 6కి బయలుదేరి రాత్రి 11:15కి హైదరాబాద్ చేరుతుంది. జనరల్ టికెట్‌తో ప్రయాణించొచ్చు. ఈ ట్రైన్ చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.

ఆధార్‌లో పుట్టిన తేదీ.. ఎక్కువసార్లు మార్చుకోవచ్చా?
ఆధార్‌లో పుట్టిన తేదీ(Date of Birth)ని ఒక్కసారి మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. రెండోసారి మార్చాల్సి వస్తే సరైన బర్త్ సర్టిఫికెట్ లేదా నమోదు సమయంలో ఆపరేటర్ పొరపాటు చేసినప్పుడు మాత్రమే ప్రత్యేక అనుమతితో పరిశీలిస్తారు. తప్పుడు ఆధారాలతో లేదా వయసులో భారీ తేడాలతో మార్చాలని చూస్తే అప్డేట్ రద్దయి కార్డు నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు వార్న్ చేస్తున్నారు.

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
బడ్జెట్ సెగ్మెంట్లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&utm_medium=GDN&utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&gad_source=1&gad_campaignid=24191099501&gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.
Crime
See all →
డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.

బర్త్‌డే పేరుతో NRI కిడ్నాప్
AP : బర్త్‌డే గ్రాండ్‌గా చేద్దామని బ్రిటన్ నుంచి రప్పించి, ఒక NRIని స్నేహితులే కిడ్నాప్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన సుమంత్ అనే యువకుడిని తిరుపతి, హైదరాబాద్‌లలో బంధించి, అతడి టెలిగ్రామ్ ఛానెల్ అమ్మేసి రూ.1.94 కోట్లు తీసుకున్నారు. సుమంత్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి మెసేజ్ చేయడంతో సైబరాబాద్ పోలీసులు ఫ్లాట్‌పై దాడి చేసి రక్షించారు. తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని (బాలాజీ, చరణ్, వాజిద్ బాషాలను) అరెస్ట్ చేశారు.

ప్రియురాలికి iPhone కొనివ్వాలని.. గంజాయి మార్గం
TG: ఖమ్మ జిల్లాకు చెందిన 21 ఏళ్ల మిత్ర చైతన్య తన ప్రియురాలికి iPhone కొనివ్వాలని అనుకున్నాడు. దానికి డబ్బు కావాలి. అందుకోసం ఒడిశాలోని పసుపులంక నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో వైరా పోలీసులు తనిఖీలు చేసి అతణ్ని పట్టుకున్నారు. 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

పదిరలో భర్త చేత భార్య హత్య.. అత్తపై కూడా దాడి!
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో దారుణం జరిగింది. భర్త పల్లపు సురేష్ తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో అత్త కూడా తీవ్రంగా గాయపడింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. గాయపడిన వృద్ధురాలిని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
Education
See all →
12 రోజులుగా హంగర్ స్ట్రైక్.. 590 మంది బలైపోయారా?
నాసిక్‌లో 12 రోజులుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న ట్రైబల్ స్టూడెంట్స్‌ను అభిజీత్ దిప్కే కలసి మద్దతు ఇచ్చారు. అక్కడ ఫుడ్, ఎడ్యుకేషన్, ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్లే లాస్ట్ 2 ఇయర్స్‌లో 590 మంది స్టూడెంట్స్ చనిపోయారని ఫైర్ అయ్యారు. దీక్ష చేస్తున్న వారి హెల్త్ పాడవుతుంది కాబట్టి స్ట్రైక్ ఆపి, డిమాండ్స్ నెరవేరే వరకు ఫైట్ చేయాలని చెప్పారు. అవసరమైతే అందరం కలసి ముంబైకి మార్చ్ చేద్దామని పిలుపునిచ్చారు.

నిద్రలో మన శరీరం ఏం చేస్తుందో తెలుసా? 😴
మనకు నిద్ర అంటే రోజంతా చేసిన పనికి ఒక బ్రేక్‌లా అనిపిస్తుంది.. కానీ మనం నిద్రలోకి జారుకున్న వెంటనే శరీరం మాత్రం మరో షిఫ్ట్ మొదలుపెడుతుంది. మెదడు రోజంతా వచ్చిన సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూ జ్ఞాపకాలను బలపరుస్తుంది. శరీరం కణజాలాల రిపేర్, హార్మోన్ల సమతుల్యత వంటి కీలక పనులను కొనసాగిస్తుంది. ఇదే సమయంలో గుండె వేగం, శ్వాస నెమ్మదిస్తాయి. అంటే నిద్రలో శరీరం లోపల రిపేర్, రీసెట్ పనులు జరుగుతూ ఉంటాయి. అందుకే మంచి నిద్ర మన మెదడు, శరీరాన్ని మరుసటి రోజుకు ఫ్రెష్‌గా సిద్ధం చేస్తుంది.

Digital Detox అంటే ఏమిటి?
లేవగానే ఫోన్, పడుకునే ముందు ఫోన్… నోటిఫికేషన్ ఫోన్! ఇలా స్క్రీన్ మన రోజులో ఎంత భాగమైందో మనకే తెలియదు. ఈ అలవాటుకు కాస్త బ్రేక్ ఇచ్చి, అవసరం లేని ఫోన్, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించడాన్నే "డిజిటల్ డిటాక్స్" అంటారు. అంటే ఫోన్‌ను పూర్తిగా వదిలేయడం కాదు… అవసరం లేని స్క్రీన్ టైమ్‌ను తగ్గించి, దృష్టిని నిజ జీవిత పనులపైకి మళ్లించడం. ఇలా చేస్తే ఫోకస్ పెరగడం, స్క్రీన్ అలవాటు తగ్గడం, మనసుకు ప్రశాంతత కలగడం వంటి ప్రయోజనాలు ఉండొచ్చు. టెక్నాలజీని వదిలేయడం కాదు.. దాన్ని కంట్రోల్ చేయడమే డిటాక్స్.

సగం సమాచారం.. ఫుల్ కాన్ఫిడెన్స్!
మనకు విషయం పూర్తిగా తెలియకపోయినా.. ఎవరో ఒకరు అడిగితే వెంటనే “నా ఒపీనియన్ ఇదే” అని చెప్పేస్తాం. ఎందుకంటే మన మెదడు ఖాళీగా ఉండటం కంటే, అసంపూర్ణ సమాచారంతోనైనా ఒక నిర్ణయానికి రావడాన్నే సులభంగా భావిస్తుంది. పైగా సోషల్ మీడియాలో ఒకే వైపు కథనం పదేపదే కనిపిస్తే, అది నిజమే అనిపించొచ్చు. మన చుట్టూ ఉన్నవాళ్ల అభిప్రాయాలు కూడా మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. కానీ తెలియని విషయంపై గట్టిగా మాట్లాడటం, తెలిసిన విషయాన్ని చెప్పడంతో సమానం కాదు. “నాకు పూర్తిగా తెలియదు” అని చెప్పగలగడం కూడా ఒక తెలివైన స్పందనే.
Health
See all →
రోజూ న్యూడుల్స్ తింటున్నారా?
తరచూ ఇంట్లోనే న్యూడుల్స్ తయారు చేసుకొని తినడం పిల్లలతోపాటు పెద్దలకూ అలవాటు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు అంటున్నారు. 75 గ్రాముల న్యూడుల్స్లో 750 మిల్లీగ్రామ్స్ సోడియం, 6.2 గ్రాముల స్యాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నాయి. వీటిని తరచూ తింటే స్యాచురేటెడ్ ఫ్యాట్ పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. న్యూడుల్స్‌ని విడిగా తీసుకోకుండా, కూరగాయలు, గుడ్డు వంటి పోషకమైన పదార్థాలతో కలిపి తీసుకోవడం బెటర్ అని అంటున్నారు.

ఓటీటీ బింజ్-వాచింగ్ (Binge-watching) ముప్పు
ఓటీటీల్లో వరుసగా వెబ్ సిరీస్‌లను గంటల తరబడి చూసే బింజ్-వాచింగ్ (Binge-watching) మానసిక అనారోగ్యానికి దారి తీస్తోంది. ఎక్కువగా Binge-watching చేసేవారిలో నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, ఒంటరితనం కనిపిస్తున్నట్లు స్టడీలు చెబుతున్నాయి. స్క్రీన్ టైమింగ్‌లో ఎక్కువగా గడిపే యూత్ వాళ్ల రోజువారీ జీవితం, సోషల్ రిలేషన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓటీటీ చూడటానికి లిమిటేషన్స్, నిద్రకు ముందు ఎక్కువసేపు స్క్రీన్ చూడకపోవడం మంచిదని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

కృత్రిమ పనీర్‌పై దేశవ్యాప్తంగా బ్యాన్?
దేశవ్యాప్తంగా కృత్రిమ పనీర్‌ను నిషేధించేందుకు FSSAI నిబంధనలు తీసుకొస్తోంది. ఇప్పటికే పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ సహా 8 రాష్ట్రాల్లో దీని తయారీ, అమ్మకాలపై బ్యాన్ ఉంది. పాల స్థానంలో కూరగాయల నూనెలు ఉపయోగించే ఈ పనీర్‌ను పాన్-ఇండియా స్థాయిలో బ్యాన్ చేసేందుకు FSSAI CEO ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఈ-కామర్స్ యాప్‌లలో ఎక్స్పైరీ డేట్లు స్పష్టంగా ఉండాలని, స్కూళ్లకు 50 మీటర్ల లోపు జంక్ ఫుడ్ అమ్మకాలపై ఆంక్షలు విధించారు. రూల్స్ మీరిన 5 స్టార్ హోటళ్లకు నోటీసులు ఇచ్చారు.

కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు చెక్.. అదిరిపోయే 3 AI టూల్స్!
కిడ్నీ ప్రాబ్లమ్స్‌ను 1st స్టేజ్‌లోనే గుర్తించేందుకు IIT మద్రాస్, CMC వెల్లూర్ రీసెర్చర్స్ 3కొత్త AI టూల్స్ డెవలప్ చేశారు. 1. CKD రిస్క్ ప్రిడిక్షన్ మోడల్: మెడికల్ రిపోర్ట్స్‌ను ఎనలైజ్చేసి ఫ్యూచర్లో కిడ్నీ రిస్క్‌ను అంచనా వేస్తుంది. 2. CT స్కాన్ క్లాసిఫైయర్: కిడ్నీలో కణితులు, రాళ్లు, సిస్ట్లు ఉన్నాయో లేదో స్కాన్స్ లో ఐడెంటిఫై చేస్తుంది. 3. 3D ఇమేజింగ్ ప్లాట్‌ఫామ్: కణితుల సైజ్‌ను కచ్చితంగా మెజర్ చేస్తుంది. వీటితో స్టార్టింగ్ స్టేజ్‌లోనే ట్రీట్మెంట్ ఈజీ అవుతుందని ప్రొఫెసర్ శామ్యూల్ చెప్పారు.
Sports
See all →
రోహిత్ శర్మ భవిష్యత్తుపై BCCI రివ్యూ
రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి BCCI రివ్యూ మీటింగ్‌లో చర్చ జరిగింది. అయితే రోహిత్ రిటైర్మెంట్పై ఇప్పటివరకు ఎలాంటి అఫిషియన్ డెసిషన్ తీసుకోలేదు. BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా కూడా రోహిత్ ఫామ్‌లో ఉన్నాడని చెప్పారు. ప్రస్తుతానికి రోహిత్ వన్డే క్రికెట్లో కొనసాగాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆయన పనితీరు, ఫిట్‌నెస్‌పై 2027 వరల్డ్ కప్‌కి ఆయన సెలక్షన్ ఆధారపడి ఉంటుంది.

ధోనీ ₹100 కోట్ల కేసులో బిగ్ ట్విస్ట్!
MS ధోనీ కేసులో న్యూ అప్డేట్. 2013 IPL బెట్టింగ్ స్కామ్‌లో తన పేరు లింక్ చేశారని ధోనీ 2014లో మాజీ IPS ఆఫీసర్ సంపత్ కుమార్, జీ మీడియా మరియు సుధీర్ చౌదరిలపై ₹100 కోట్ల డిఫమేషన్ సూట్ వేశారు. అయితే ధోనీ స్టేట్మెంట్ను ప్రైవేట్ హోటల్లో కాకుండా కోర్టు లేదా గవర్నమెంట్ బిల్డింగ్‌లోనే వీడియో రికార్డ్ చేయాలని సంపత్ కుమార్ మద్రాస్ హైకోర్టును కోరారు. మంగళవారం జస్టిస్ గోవిందరాజన్ తిలకవతి ఈ అప్లికేషన్‌ను విచారణకు స్వీకరించారు.

42 బాల్స్‌లోనే 50 రన్స్ ..వైభవ్ సూర్యవంశీ కొత్త రికార్డు
క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీలో కొత్త రికార్డు సాధించాడు. టోర్నమెంట్లో హాఫ్ సెంచరీ చేసిన అతి చిన్న వయసు వ్యక్తిగా మారాడు. నిన్న బెంగళూరులో జరిగిన సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున సెంట్రల్ జోన్‌పై ఆడుతూ 81 బాల్స్‌లో 92 రన్స్ చేశాడు. 42 బాల్స్‌లోనే 50 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టాడు. 15 సంవత్సరాల 157 రోజుల వయసులో ఈ రికార్డు సాధించాడు. 50 ఏళ్లకు పైగా ఉన్న పాత రికార్డును అతను దాటేసి కొత్త రికార్డ్ నెలకొల్పాడు.

లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ అనౌన్స్మెంట్
ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ 39 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి రిటైర్ అయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పానిష్ భాషలో చేతితో రాసిన నోట్‌బుక్ ఎంట్రీని పోస్ట్ చేస్తూ, అర్జెంటీనా జాతీయ జట్టు నుంచి రిటైర్ అవుతున్నట్లు తెలిపారు. పోస్ట్ చివర్లో “ఈ మాటలు జూలై 21న, ఫైనల్ తర్వాత రెండు రోజులకు రాశాను. నా తండ్రికి జరిగినది తర్వాత నేడు దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాను” అని కూడా రాశారు. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ ఆగస్టు 8న రోసారియోలోని ఆసుపత్రిలో 68 ఏళ్ల వయసులో మరణించారు.
Agriculture
See all →
యాప్‌లోనూ కనిపించని యూరియా.. రైతుల ఆందోళన
నర్సంపేట డివిజన్లో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజులుగా యూరియా కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నా సరిపడా నిల్వలు అందుబాటులో లేవని అంటున్నారు. మరోవైపు యాప్‌లో యూరియా బస్తాలను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినా నర్సంపేట, ఖానాపురం ప్రాంతాల్లో యూరియా అందుబాటులో ఉన్నట్లు కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. గతేడాది ఎదుర్కొన్న యూరియా కొరత పరిస్థితి ఈ ఏడాది కూడా ఎదురుకావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యాప్ వచ్చినా..యూరియా కష్టాలు తీరలేదన్నా!
TG: యూరియా కోసం యాప్‌లో బుక్ చేసుకున్నారు. బుకింగ్ సక్సెస్ అంటూ చూపించింది. తీరా యూరియా తీసుకునేందుకు దుకాణానికి వెళ్తే స్టాక్ లేదు అంటూ సమాధానం వస్తోంది. దీంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. యూరియా సరఫరాను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం ఒకవైపు యాప్‌లో బుకింగ్ చేసుకోవడం, మరోవైపు దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఘాటెక్కుతున్న ఉల్లి ధరలు
AP: ఎలినినో ప్రభావంతో పంటల ఉత్పత్తి తగ్గిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఉల్లి ధరలు కూడా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిలో ఉల్లిపాయలు రూ.25 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.35కు చేరాయి. ధరలు ఒక్కసారిగా పెరగడంతో రోజువారీ కొనుగోళ్లపై అదనపు భారం పడుతోందని వినియోగదారులు వాపోతున్నారు.

Fertilizers Appలో యూరియా లేక రైతుల ఇబ్బందులు
Fertilizers Appలో యూరియా అందుబాటులోకి రాగానే రెప్పపాటులో అయిపోతోంది. సమయానికి యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులను వేడుకుంటున్నారు. రైతులకు ఉపయోగపడని ఈ Online యూరియా అమ్మకాలు ఎవరి కోసం అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సులభంగా, సమయానికి యూరియా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు.
Arts/Literature
See all →
స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం
ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ ప్రపంచ స్త్రీవాద సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించింది. ఇటాలియన్ రచయిత్రి ఒరియనా ఫాలసి రాసిన ‘Letter to a Child Never Born’ పుస్తకాన్ని ఓల్గా తెలుగులో అనువాదం చేశారు. తల్లి తన కడుపులో బిడ్డ ఉన్నట్టు గుర్తించినప్పటి నుంచి, అండం గర్భంలో పెరిగి రూపం మారే ప్రక్రియను ఇందులో వివరంగా చెప్పారు. ఇది కేవలం శరీరం గురించి రాసిన రచనే కాదు, సామాజిక వ్యాఖ్యానం కూడా. పితృస్వామ్యం మన ఆచారాలు, భాష, సంస్కృతులను ఎలా తయారు చేసిందో ఈ పుస్తకం చెబుతుంది. పుస్తకం ధర రూ.100. కొనే <a href="https://www.telugubooks.in/products/puttani-biddaku-thalli-uttharam?srsltid=AfmBOorDrAEUy8FkbTr9Tubb4BId_N3ZPRpD-RxM8kBlKq7YQfh7Ni_b">లింక్</a>.

‘కొండమల్లు’ - నవల
తెలుగులో చారిత్రక నవలలు చాలా వరకూ పాఠకుల ఆదరణ పొందాయి. చక్కటి కథనంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. వర్ధెల్లి వెంకటేశ్వర్లు రాసిన ‘కొండమల్లు’ నవల అలాంటిదే. పల్నాటి రాజ్యం ఏర్పడినప్పటి నుంచి, పల్నాటి యుద్ధానికి ముందు బ్రహ్మనాయుడు వనవాసానికి వెళ్లే వరకు ఈ కథ సాగుతుంది. పల్నాటి చరిత్రను ఆధారంగా చేసుకున్న నవల అయినా, ఇందులో చెంచుల జీవన విధానాన్ని రచయిత అద్భుతంగా చూపించారు. చెంచుల భాషలోనే ఆ సంభాషణలు ఉండటం మరో ప్రత్యేకత. చారిత్రక నవలలు ఇష్టపడేవాళ్లు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ధర ₹300. కొనే <a href="https://amzn.in/d/0f7KO8Jc">లింక్</a>.

తెలుగు చారిత్రక నవలలపై గుంటూరులో ప్రత్యేక సదస్సు
AP: సాహిత్య అకాడమీ, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కలిసి తెలుగు చారిత్రక నవలలపై గుంటూరులో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 6 ఆదివారం ఉదయం 10 గంటలకు నగరంపాలెంలోని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి బాలుర హాస్టల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. రచయితలు వల్లూరు శివప్రసాద్, మోదుగుల రవికృష్ణ, కోనేరు రవికుమార్, సి.హెచ్.సుశీలమ్మ తదితరులు పాల్గొంటారు.

బొంబాయి పొట్టేలు – కథల పుస్తకం
కథకుడు, చిత్రకారుడు చరణ్ పరిమి రాసిన రెండో కథల పుస్తకం ‘బొంబాయి పొట్టేలు’. రేగి అచ్చులు ప్రచురణ సంస్థ దీన్ని ప్రచురించింది. అబ్స్ట్రాక్ట్, సర్రియల్ టచ్‌తో సాగే ఈ కథలు సమాజంలోని అనేక కోణాలను కొత్తగా చూపిస్తాయి. అసమానతలు, వివక్ష, మనుగడ పోరాటాలను ఎదుర్కొనే పాత్రలు ఈ కథల్లో కనిపిస్తాయి. ఈ పుస్తకానికి రచయిత డా.వేంపల్లె షరీఫ్ ముందుమాట రాశారు. రచయిత చరిత్రను, ఆధిపత్య సంస్కృతి రాజకీయాలను అర్థం చేసుకుని రచయిత ఈ కథలు రాశారని ఆయన వివరించారు. దీని ధర రూ.170. పుస్తకం కొనే <a href="https://amzn.in/d/0dDm8w3U">లింక్</a>.
Current Affairs
See all →
ఆర్జీకర్ కేసులో పురోగతి లేదు: బాధితురాలి తల్లి
కోలకత్తా ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన హత్యాచారం కేసులో సీబీఐ విచారణలో ఎలాంటి డెవలప్మెంట్ లేదని బాధితురాలి తల్లి, బీజేపీ పనిహతి ఎమ్మెల్యే రత్నా దేబ్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా న్యాయం దక్కడం లేదని అన్నారు. 2024 ఆగస్టు 9న తన కూతురు హత్యకు గురైన తర్వాత తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. తనకు న్యాయం జరిగేలా వ్యవస్థను మార్చాలని, కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
CJP నిరసనలో దాడి.. అయినా జైలుకెళ్లలేదు
ఢిల్లీలో CJP చేపట్టిన నిరసనలో ఓ ప్రొటెస్టర్ తండ్రిపై దాడి చేసి ఎలా తప్పించుకున్నారో Swatantra Bhardwaj అనే రైట్-వింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక పోడ్కాస్ట్లో చెప్తున్న వీడియో వైరల్ అవుతోంది. సంజయ్‌కుమార్ తలపై ఏడు కుట్లు పడ్డాయని, ఆయన కూతురు నిషూ ఆజాద్ పోలీస్‌స్టేషన్ బయట నిలబడి ‘మా నాన్నకు న్యాయం జరగకపోతే విషం తాగి చచ్చిపోతాం’ అని చెప్పిందని వివరించాడు. తర్వాత రోజు తామంతా బయట ఉన్నామని, జైలుకే వెళ్లలేదన్నాడు. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్, మోదీ లాంటి వాళ్ల సపోర్ట్ తమకుందని అతను వీడియోలో చెప్పాడు.

అర్ధరాత్రి రైల్లో మహిళకు అవమానం..భారీ ఫైన్
రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఓ మహిళను అర్ధరాత్రి రైలు నుంచి దించేయడంపై కేరళ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆమెకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ అలెగ్జాండర్ థామస్ జీవో జారీ చేశారు. టికెట్ లేదంటూ RPF కేసు నమోదు చేయగా, తప్పుగా కేసు పెట్టినట్లు గుర్తించి రైల్వే అధికారులు కేసు ఉపసంహరించుకున్నారు. మహిళను రాత్రివేళ దించడం రైల్వే రూల్స్‌కి విరుద్ధమని థామస్ అన్నారు. నెలలోపు పరిహారం చెల్లించాలని, ఆలస్యమైతే 8 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించారు.

బకెట్లో 160 డిటోనేటర్లు..
హైదరాబాద్ బొల్లారమ్ ఆర్మీ క్యాంప్ గోడ పక్కన ఒక ప్రైవేట్ ల్యాండ్‌లో బకెట్లో ఉన్న 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ దొరకడం పెద్ద షాకింగ్ న్యూస్ అయింది. రీసెంట్గా అక్కడ ఆర్మీ <a href="https://www.theclearcutnews.com/n/j7APUTj">వెపన్స్ దొంగతనం</a> అవ్వడంతో అందరిలో టెన్షన్ పెరిగింది. అయితే సైట్ డెవలప్మెంట్ వర్క్స్ కోసమే వీటిని తెచ్చారని, ఆ ఆయుధాల దొంగతనానికి దీనికి ఎలాంటి లింక్ లేదని డీసీపీ శ్రీధర్ క్లారిటీ ఇచ్చారు. కేర్లెస్గా డిటోనేటర్స్ వదిలేసిన ల్యాండ్ ఓనర్స్‌పై పోలీసులు కేస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.
Entertainment
See all →
‘మీ కోసమే తీస్తున్నాం’.. మేకర్స్ కామెంట్స్‌పై తాప్సీ ఫైర్!
‘పెద్ది’, ‘టాక్సిక్’ లాంటి సినిమాల్లో హీరోయిన్లను అభ్యంతరకరంగా చూపించడంపై నటి తాప్సీ మాట్లాడారు. ‘ఆడియన్స్ ఇదే చూస్తున్నారు’ అంటూ మేకర్స్ తప్పును జనాలపై నెట్టేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేవలం కలెక్షన్ల కోసమే చూస్తూ కంటెంట్‌ను పక్కన పెట్టేస్తున్నారని అన్నారు. జనాలు సపోర్ట్ చేస్తేనే మార్పు వస్తుందని, ఒకవైపు ట్రోల్ చేస్తూనే ఇంకోవైపు ఆ సీన్లను కట్ చేసి వైరల్ చేసే బ్యాచ్ కూడా ఉందని తాప్సీ తెలిపారు.

సూర్య 50వ సినిమా అదేనా?
‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్‌తో భయపెట్టిన తమిళ స్టార్ హీరో సూర్య, ఇప్పుడు తన 50వ సినిమాపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో హిట్లు కొట్టిన సూర్య, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రోలెక్స్ పాత్రతోనే పూర్తి సినిమా రాబోతోందనే వార్తలపై తాజాగా స్పందించారు. దీంతో ఈ రోలెక్స్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

నవ్వుల హంగామాతో అల్లరి నరేష్
కామెడీ కింగ్ అల్లరి నరేష్ కొత్త సినిమా ‘రంభ ఊర్వశి మేనక’ థియేటర్లలోకి వచ్చేసింది. చంద్రమోహన్ చింతాడ డైరెక్ట్ చేసిన ఈ ఫన్ మూవీలో సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ హీరోయిన్లుగా నటిస్తే, వెన్నెల కిషోర్, నరేష్ వీకే ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఎంటర్టైన్మెంట్తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.

OTTలోకి ‘DC’
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన యాక్షన్ క్రైమ్ సినిమా ‘DC’ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. అరుణ్ మాథేశ్వరన్ తీసిన ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్గా నటించింది. థియేటర్లలో హిట్ కొట్టిన ఈ సినిమా, ఈరోజు (September 4) నుంచి Sun NXT యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ చూసేయొచ్చు.
Gen Z
See all →ఢిల్లీ పోలీసులకు 72 గంటలే టైమ్- చంద్రశేఖర్ ఆజాద్
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు ప్రొటెస్ట్ చేశారు. జంతర్ మంతర్ ధర్నాలో నిషు ఆజాద్ తండ్రి సంజయ్‌పై దాడి చేసినట్లు ఒక<a href="https://www.theclearcutnews.com/n/iUokvD9"> podcast</a>లో ఒప్పుకున్న స్వాతంత్ర భరద్వాజ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు బెదిరింపులు వస్తున్నాయని, 72 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయకపోతే ఢిల్లీ పోలీస్ కమిషనర్, హోం మంత్రి ఆఫీసులను ముట్టడిస్తామని ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు.

మన Feed మన అభిప్రాయాలను నిజంగానే మార్చగలదా?
మన ఫీడ్‌లో రోజూ కనిపించే పోస్టులు… మన అభిప్రాయాలపై ప్రభావం చూపగలవా? అవును, కొంతవరకు! మనం ఏ కంటెంట్‌ను చూస్తున్నాం, దేనికి స్పందిస్తున్నాం అనే దాని ఆధారంగా అల్గారిథమ్ మనకు ఇలాంటి పోస్టులనే మళ్లీ చూపిస్తుంది. దీంతో ఒకే రకమైన అభిప్రాయాలు పదే పదే కనిపిస్తూ, అవే నిజాల్లా అనిపించొచ్చు. 2026లో వచ్చిన ఒక పరిశోధనలో, Xలో అల్గారిథమిక్ ఫీడ్ వాడిన కొంతమంది వినియోగదారుల రాజకీయ అభిప్రాయాల్లో మార్పులు కనిపించాయి. అందుకే ఫీడ్ మన ఆలోచనలను పూర్తిగా నిర్ణయించదు… కానీ మనం రోజూ చూసేదాన్ని మాత్రం ప్రభావితం చేయగలదు.

విజయవాడలో GenZ Protest
AP: విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర రేపు(4వ తేదీ), ఎల్లుండి (5వ తేదీ) GenZ Protest జరగనుంది. Duchenne muscular dystrophy(DMD), Spinal muscular atrophy(SMA) అనే వ్యాధులు చిన్నారులను ఇబ్బంది పెడతాయి. వీటికి చికిత్స అందించాలంటే రూ.కోట్ల ఖరీదైన ఇంజెక్షన్స్ అందించాలి. ఇలాంటి పిల్లలు రాష్ట్రంలో వెయ్యి మంది దాకా ఉన్నారు. వీళ్లని ప్రభుత్వమే ఆదుకోగలదని Social Thinker, Insta Influencer గంజి ప్రశాంత్ అన్నారు. అలాంటి పిల్లల కోసం Silent Protest చేస్తున్నామని, దీనికి రావాలని వీడియో ద్వారా పిలుపునిచ్చారు.

AI ఎంట్రీ-లెవల్ Jobs తీసేస్తే.. రేపటి Experts ఎక్కడి నుంచి?
కాలేజీ పూర్తయ్యాక మొదటి ఉద్యోగం దొరకడం, కెరీర్‌కు తొలి మెట్టు. కానీ AI కారణంగా ఈ మెట్టే తగ్గిపోతే భవిష్యత్‌లో నిపుణులు ఎక్కడి నుంచి వస్తారు? ఇదే ఇప్పుడు టాలెంట్ మార్కెట్లో కీలక ప్రశ్న. ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల్లోని పునరావృత పనులను AI సులభంగా ఆటోమేట్ చేయగలదు. దీంతో సంస్థలకు వెంటనే ఖర్చు, సమయం తగ్గొచ్చు. కానీ జూనియర్లకు నేర్చుకునే అవకాశం తగ్గితే, రేపటి సీనియర్ నిపుణుల కొరత రావచ్చు. ఈ సమస్యను తగ్గించేందుకు కంపెనీలు AIతో పాటు శిక్షణ, అప్రెంటిస్‌షిప్ అవకాశాలపై పెట్టుబడి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
International
See all →
ఆర్కిటిక్ సముద్రాన్ని గడ్డకట్టించే ప్రయోగాలు
బ్రిటన్ ప్రభుత్వ ఆర్థిక సాయంతో ‘Real Ice’ పేరుతో జియో ఇంజినీరింగ్ ప్రయోగం చేపట్టినట్లు 'ఆండ్రియా సెకోలిని’ సంస్థ వెల్లడించింది. తొలి ప్రయత్నంలో మంచి రిజల్ట్స్ వచ్చినట్లు తెలిపింది. ఇదే తరహాలో ‘Reflection’ అనే మరో సంస్థ కూడా ప్రయోగం నిర్వహించి 45 సెంటీమీటర్ల మందమైన మంచుపొరను సృష్టించినట్లు పేర్కొంది. ఆర్కిటిక్ ఉపరితలాన్ని పరిశీలించిన సమయంలో కొన్ని ప్రాంతాల్లో సహజంగా రంధ్రాలు ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో ప్రయోగంలో భాగంగా డ్రిల్లింగ్ చేసి ఆ రంధ్రాల ద్వారా సముద్రంలోని నీటిని పైకి పంపించారు.

ప్రపంచ దేశాలను హెచ్చరించిన UN
ప్రపంచవ్యాప్తంగా 'సూపర్‌సైజ్డ్ ఎల్‌నినో' (Supersized El Niño) పరిస్థితులు ఏర్పడే అవకాశముందని ఐక్యరాజ్యసమితి (UN) హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడం, కరువు, వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలపై భారం పడే ప్రమాదముందంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, ప్రజలకు నష్టం కలగకుండా తగిన ప్రొటెక్షన్ చర్యలు చేపట్టేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

టాటా కంపెనీపై కెన్యా ప్రెసిడెంట్ సీరియస్
కెన్యాలోని టాటా కెమికల్స్ మగాదీపై ప్రెసిడెంట్ విలియమ్ రూటో ఫైర్ అయ్యారు. దేశం నుంచి కంపెనీ వెళ్లిపోవాలని ఆదేశించారు. 100 ఏళ్లుగా కెన్యాలో ఆపరేషన్స్ సాగిస్తున్నా లోకల్ ప్రజలకు, ఎకానమీకి సరైన బెనిఫిట్ కలగలేదని ఆరోపించారు. సోడా యాష్‌ను ఎక్స్పోర్ట్ చేయడం తప్ప స్థానికంగా గ్లాస్, కెమికల్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదని సీరియస్ అయ్యారు. టాటా స్థానంలో రెండు కొత్త కంపెనీలను తీసుకొచ్చి స్థానికులకు జాబ్స్ కల్పిస్తామని చెప్పారు. అయితే స్థానిక రూల్స్‌ను ఫాలో అవుతూనే ఆపరేషన్స్ చేశామని టాటా కెమికల్స్ చెబుతోంది.
ఇంకా చాలా మంది ఉన్నారా? టన్నెల్లో ఘోరం!
నేపాల్‌లో ఆగస్టు 26న వచ్చిన భారీ వరదల వల్ల 'త్రిశూలి 3A' హైడ్రో పవర్ ప్రాజెక్ట్ టన్నెల్లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ టీమ్స్ సేఫ్‌గా కాపాడారు. దాదాపు 10 రోజుల పాటు టన్నెల్ లోపలే ఉండిపోయిన వారిని ఎంతో కష్టపడి బయటకు తీశారు. సెర్చ్ ఆపరేషన్ టైమ్‌లో లోపల నుంచి మరికొందరి గొంతులు కూడా వినిపించడంతో రెస్క్యూ ఆపరేషన్స్‌ను మరింత స్పీడప్ చేశారు. ప్రస్తుతం ఆర్మీ, ఇతర సెక్యూరిటీ టీమ్స్ లోపల ఉన్న మిగతా వారిని బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Jobs
See all →
PFRDAలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
PFRDA రిక్రూట్మెంట్ 2026లో మొత్తం 30 వేకెన్సీస్కు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. Assistant Manager (Grade A) పోస్టులకు General, Research, Actuary, Official Language స్ట్రీమ్స్‌లో పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే అప్లికేషన్స్ స్టార్ట్ కాగా, సెప్టెంబర్ 24 లోపు <a href="https://ibpsreg.ibps.in/pfrdajul26/">అప్లై చేసుకోవచ్చు.</a> అర్హత స్ట్రీమ్‌ను బట్టి మారుతుంది. మ్యాక్సిమమ్ ఏజ్ ముప్పై ఏళ్లు ఉండాలి. General/EWS/OBC వారికి ఫీజు రూ. 1,000, SC/ST/PwBD/Womenకు ఎటువంటి ఫీజు లేదు. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://pfrda.org.in/w/advertisement-recruitment-of-officer-grade-a-assistant-manager-2026?p_l_back_url=%2Fget-to-know%2Fcareers%2Fvacancies&p_l_back_url_title=Vacancies">Click</a> చేయండి.

AI స్కిల్స్ ఉంటేనే భారీ జీతాలు.. రెండేళ్లలో 23% Growth
ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో AI skills ఉన్నవారికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. AI రంగంలోని ఎంప్లాయిస్ జీతాలు గత రెండేళ్లలో 23 శాతం వరకు పెరిగినట్లు తాజా ఉద్యోగ పోర్టల్ పౌండిత్ రిపోర్ట్ చెబుతుంది. సెమీకండక్టర్ రంగంలోనూ వేతనాలు 17 శాతం పెరిగినట్లు చెప్పింది. సాధారణ IT ఉద్యోగాల్లో జీతాల పెరుగుదల అంతగా కనిపించడం లేదని పేర్కొంది. AI, డేటా, ఇతర కొత్త టెక్నాలజీలపై skills పెంచుకుంటే జాబ్ అవకాశాలతోపాటు మంచి salary పొందే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. APలో 917, తెలంగాణలో 419 ఖాళీలు
ఇండియా పోస్ట్‌లో (GDS, BPM, ABPM) 25,000+ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 10th క్లాస్ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. ఏజ్ 18–40 ఏళ్లు మధ్య ఉండాలి. రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 19 లోపు చేసుకోవాలి. అప్లికేషన్స్ ఇప్పటికే స్టార్ట్ కాగా, ఈనెల 21తో ముగుస్తాయి. మేల్ జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. SC/ST/PwD, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. సెలెక్షన్ 10th క్లాస్ (SSC) మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ కోసం ఇక్కడ <a href="https://www.indiapost.gov.in/gdsonlineengagement">Click </a>చేయండి.

బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్నారా? RRBsలో భారీ నోటిఫికేషన్!
బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్న వారికి IBPS RRB CRP-XV నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 13వేలకు పైగా జాబ్స్ ఫిల్ చేయనున్నారు. ఇందులో <a href="https://ibpsreg.ibps.in/rrboaxvaug26/">Office Assistant (Multipurpose)</a>, <a href="https://ibpsreg.ibps.in/rrbxvaug26/">Officer Scale-I, II, III</a> పోస్టులు ఉన్నాయి. ఈనెల 1 నుంచి 21, 2026 వరకు ఆన్లైన్లో Apply చేసుకోవచ్చు. ఫీజు General/OBC/EWS క్యాండిడేట్స్‌కు రూ. 850, SC/ST/PwBD వారికి రూ. 175. ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, లోకల్ లాంగ్వేజ్‌పై పట్టు ఉండాలి. ఏజ్ పోస్టును బట్టి 18 - 40 ఏళ్లలోపు ఉండాలి. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://www.ibps.in/index.php/rural-bank-xv/">Click</a> చేయండి.
Local
See all →
మల్దకల్లో బీఆర్ఎస్ వంటావార్పు
TG: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి, బస్‌స్టాండ్ వద్ద వంటావార్పు చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి 1000 రోజుల పాలన అంటూ సంబరాలు చేసుకోవడాన్ని బీఆర్ఎస్ నాయకులు తప్పుబట్టారు.

సూరసముద్రం చెరువు పరిరక్షణకు చర్యలు
TG: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలోని సూరసముద్రం చెరువును మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, కమిషనర్ రాఘవేందర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. చెరువులో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను పరిశీలించి మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. చెరువును పరిశుభ్రంగా, సుందరంగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పత్య నాయక్ అన్నారు. చికెన్, మటన్, చేపల వ్యర్థాలు, ఆసుపత్రుల సిరంజీలు, గాజు ముక్కలు తదితరాలను చెరువులో వేయొద్దని సూచించారు. ‘మన ఊరు–మన చెరువు’ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు.

బెల్ట్ షాపుల నియంత్రణకు గ్రామపంచాయతీ తీర్మానం
TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్పూర్లో అక్రమ బెల్ట్ షాపుల నియంత్రణకు గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయించే కేంద్రాలపై నిఘా ఏర్పాటు చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మాన ప్రతిని ఎస్సై సైదులుకు అందజేశారు. బెల్ట్ షాపుల కారణంగా మహిళలు, యువత ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని సర్పంచ్ మేడిపల్లి ప్రియా చంద్రశేఖర్ తెలిపారు. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు.

70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
TG: నాగర్ కర్నూల్ జిల్లాలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యారంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా స్థాయిలో ఘనంగా సన్మానించనున్నట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. బోధనా ప్రతిభ, విద్యార్థుల విద్యాభివృద్ధికి చేసిన కృషి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 5న మధ్యాహ్నం 3 గంటలకు ఐడీఓసీ మీటింగ్ హాల్లో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు.
Motivational
See all →కేరళ డ్రైవర్ ఎమోషనల్ ఫేర్వెల్!
కేరళం KSRTC బస్సు డ్రైవర్ రిటైర్మెంట్ రోజు తన బస్సుకు ఎమోషనల్ ఫేర్వెల్ చెప్పారు. ఇడుక్కి కుమిలి డిపోకి చెందిన పౌల్ కురియన్ సెప్టెంబర్ 2న తన లాస్ట్ డ్యూటీ పూర్తి చేశారు. షిఫ్ట్ ముగిశాక బస్సును పార్క్ చేసి, స్టీరింగ్‌కు ముద్దుపెట్టుకుని సాల్యూట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. KSRTC ఆఫీషియల్స్ షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకుంది. ఆయన డెడికేషన్‌ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

Placement రావాలంటే.. Planning ఉండాల్సిందే!
డిగ్రీ పూర్తయితే ఉద్యోగం వచ్చేస్తుందనుకోవడం ఒకప్పటి మాట. ఇప్పుడు అలాంటి situation లేదు. మంచి ప్లేస్మెంట్ కోసం కాలేజీ రోజుల్లోనే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఏ రంగంలో Job చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని, అవసరమైన టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్, ఆప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను పెంచుకోవాలంటున్నారు. రెజ్యూమ్ తయారీ, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలంటున్నారు. రోజూ కొంత టైం ప్రాక్టీస్ చేస్తే confidence పెరుగుతుందని సలహా ఇస్తున్నారు.
ఒంటి కాలితోనే.. కుంటుతూ బడికెళ్తోంది
UPలోని బల్లియా జిల్లా మానియర్ బ్లాక్‌లోని రానీపూర్ గ్రామానికి చెందిన రాగిణికి ఏడేళ్లు. ఆరు నెలల వయసులోనే రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోయింది. తను 1వ తరగతి చదువుతోంది. ఇంటి నుంచి 400 మీటర్ల దూరంలోని బడికి ఒంటికాలితో గెంతుతూ వెళ్తోంది. అయినా చదువు మాత్రం విడిచిపెట్టలేదు. SMలో వైరల్ అయిన తన ఉదంతం జిల్లా కలెక్టర్ మంగళా ప్రసాద్ సింగ్‌ను కదిలించింది. ఆయన రాగిణి ఇంటికి వచ్చి ట్రైసైకిల్, పుస్తకాలు, బొమ్మలు ఇచ్చారు. AAP నాయకులు ఆర్థికసాయం అందించారు. కృత్రిమ కాలు పెట్టిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.
National
See all →
భారత్ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందా?
భారత GDP(Gross Domestic Product) 7.8 శాతం వృద్ధి నమోదు చేసిందని లెక్కలు చెబుతున్నా, రియాలిటీ వేరేగా ఉందని ఆర్థిక విశ్లేషకుడు వివేక్ కౌల్ అన్నారు. దేశంలో 56.2 శాతం మంది తక్కువ ఆదాయాలతో కూడిన అసంఘటిత రంగంలో ‘Self-Employed’గా ఉన్నారని చెప్పారు. వ్యవసాయంపై ఆధారపడినవాళ్లు ఇంకా 43 శాతంగానే ఉన్నారని, Manufacutory రంగం ఉపాధి 12.1 శాతానికే పరిమితమైందని వివరించారు. కోట్లాది మంది యువత ఖాళీగా ఉండటం వల్ల హెడ్లైన్ వృద్ధి సంఖ్యలు సాధారణ ప్రజల వాస్తవ ఆర్థిక స్థితిని పూర్తిగా రిఫ్లెక్ట్ కాలేదని చెప్పారు.

FCRA సవరణ బిల్లు పరిశీలనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)
The Foreign Contribution (Regulation) Act (FCRA) సవరణ బిల్లు 2026ను పరిశీలించేందుకు 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీ డా.సంజయ్ జైస్వాల్ నేతృత్వంలోని ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులున్నారు. విదేశీ నిధులపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడం, సంస్థల రిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత వాటి ఆస్తుల నిర్వహణ వంటి అంశాలను కమిటీ పరిశీలిస్తుంది. వివిధ వర్గాల ఒపీనియన్స్ తీసుకుని శీతాకాల సమావేశాల తొలి వారంలో ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది.

SIR న్యాయబద్ధం కాదు: అశోక్ లవాసా
Election Commission చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్ అశోక్ లవాసా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలు చట్టం పేరుతో ‘బలవంతుడిదే రాజ్యం’(Might is right) అన్నట్లుగా ఉన్నాయని విమర్శించారు. చట్టాన్ని అమలు చేయడమే కాకుండా, దాని స్ఫూర్తిని కాపాడటం ముఖ్యమన్నారు. ఓటర్ల జాబితా నుంచి 13 కోట్ల మంది పేర్లను తొలగించడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. ఇది న్యాయబద్ధంగా లేదని, దీని వల్ల ప్రజలకు ప్రజాస్వామ్యంపైనే నమ్మకం పోయే ప్రమాదముందని హెచ్చరించారు.
CJP సౌరవ్ దాస్ స్ట్రాంగ్ డిమాండ్!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రొటెస్ట్‌లో ఒక దళిత కుటుంబానికి చెందిన మైనర్ బాలిక తండ్రి సంజయ్‌పై కొంతమంది క్రిమినల్స్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై FIR ఫైల్ చేసినా, హత్యాయత్నం మరియు SC/ST యాక్ట్ కింద కేసులు పెట్టకుండా పోలీస్‌లు నిర్లక్ష్యం వహించారని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. నిందితులు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా బెదిరిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో, వెంటనే వారిపై కఠిన సెక్షన్లతో అరెస్ట్ చేయాలని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద డిమాండ్ చేశారు.
Parenting
See all →
పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే చిన్న తప్పులు
పిల్లలను పెంచడం అంటే వాళ్లకు మంచి స్కూల్, మంచి చదువు, మంచి సౌకర్యాలు ఇవ్వడం మాత్రమే కాదు.. రోజూ మనం మాట్లాడే మాటలు, చూపించే ప్రవర్తన కూడా వాళ్లపై బలమైన ముద్ర వేస్తాయి. “నీకు ఇది రాదు” అనడం, ఇతర పిల్లలతో పోల్చడం, వాళ్ల తప్పులను వెంటనే ఎత్తిచూపడం, ప్రతి సమస్యను మనమే పరిష్కరించడం లాంటి చిన్న విషయాలు పిల్లల్లో భయం, ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులకు దారితీయొచ్చు. అందుకే పిల్లలు ఏం చేస్తున్నారు కంటే.. వాళ్లతో మనం ఎలా వ్యవహరిస్తున్నామో కూడా గమనించాలి.

👶 Peek-a-boo ఎందుకు ఇంత ఇష్టం?
బేబీతో ఆడుతూ మనం “Peek-a-boo!” అంటూ ముఖం దాచుకుంటే మన ముఖం మళ్లీ కనిపించగానే బేబీ నవ్వుతుంది. ఇది సరదా కాదు. ముఖం కనిపించకపోయినా మనం అక్కడే ఉన్నామని బేబీ అర్థం చేసుకోవడం ఇక్కడే మొదలవుతుంది. మళ్లీ కనిపిస్తామని ఊహించడం కూడా నేర్చుకుంటుంది. అంతేకాదు, ఈ ఆటలో చూడటం, ఎదురుచూడటం, మనతో కలిసి ఆడటం లాంటి basic social skills కూడా develop అవుతాయి. అందుకే ప్రపంచంలోని దాదాపు ప్రతి బేబీకి Peek-a-boo అంత ఇష్టం. మనకి ఇది చిన్న ఆటే అయినా బేబీకి మాత్రం ఇది ఒక పెద్ద learning.

తల్లిదండ్రులు “మా కాలంలో…” అని ఎందుకు మొదలుపెడతారు?
“మా కాలంలో ఇలా ఉండేది కాదు..” అని తల్లిదండ్రులు చెప్పడం మనలో చాలామంది వినే ఉంటాం. కానీ వాళ్లు ఇలా ఎందుకు మాట్లాడతారు? మనం పెరిగే సమయంలో మన ప్రపంచం వేగంగా మారిపోతుంది. కానీ తల్లిదండ్రులు తమ అనుభవాలనే మనకు సరైన మార్గంగా భావించడం సహజం. తాము ఎదుర్కొన్న కష్టాలు, చేసిన తప్పులు మనకు రాకూడదనే ఉద్దేశంతో సలహాలు ఇస్తుంటారు. అదే సమయంలో పిల్లల ప్రపంచం తమ కాలంతో పోలిస్తే చాలా మారిపోయిందని అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకే “మా కాలంలో…” అనేది కేవలం పోలిక కాదు.. వాళ్ల అనుభవం, భయం, ప్రేమ అన్నీ కలిసిన మాట.

పిల్లలకు ఖరీదైన గిఫ్ట్స్ కంటే.. మీతో మాట్లాడటమే కావాలా?
పిల్లలకు ఏది కావాలంటే అది కొనిస్తే వాళ్లు హ్యాపీగా ఉంటారని అనుకుంటాం. కానీ పిల్లలతో మనం గడిపే సమయం కూడా వాళ్ల ఎదుగుదలలో చాలా ముఖ్యమట. వాళ్లు ఏదైనా చెప్పినప్పుడు కాసేపు శ్రద్ధగా వినడం, వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం, రోజులో జరిగిన విషయాలు వాళ్లతో మాట్లాడటం.. ఇవన్నీ పిల్లల ఆలోచనలు, మాట్లాడే విధానం, ఇతరులతో కలిసిపోయే తీరు మెరుగుపడటానికి ఉపయోగపడతాయని రీసెర్చ్ చెబుతోంది. భోజనం చేసేటప్పుడు, బయటికి వెళ్లేటప్పుడు, పడుకునే ముందు కాసేపు మాట్లాడినా.. ఆ సమయం పిల్లలకు చాలా ఉపయోగపడొచ్చు.
Personal Finance
See all →
భారత్ Forex Reserves రికార్డ్.. $729.33B!
భారత్ Forex Reserves మరోసారి కొత్త రికార్డ్ సృష్టించాయి. ఆగస్టు 21తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు ఏకంగా $729.33Bకు చేరాయి. ఒక్క వారంలోనే $12.42B పెరిగాయి. ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు, గోల్డ్ నిల్వలు పెరగడం దీనికి కారణం. RBI తీసుకున్న కొన్ని చర్యలతో విదేశాల నుంచి భారీగా డాలర్లు భారత్‌లోకి వచ్చాయి. ఇలా నిల్వలు పెరగడం వల్ల ప్రపంచంలో ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినా, దేశానికి కొంత బలమైన రక్షణ ఉంటుంది. రూపాయిపై ఒత్తిడి వచ్చినప్పుడు RBIకి మార్కెట్లో జోక్యం చేసుకునే అవకాశం కూడా పెరుగుతుంది.

Bitcoin మళ్లీ $80,000 దాటింది!
Bitcoin ఒక్కసారిగా మళ్లీ స్పీడ్ పెంచింది! ఆగస్టు 25న తొలిసారి మే తర్వాత $80,000 మార్క్‌ను దాటింది. గత వారం రోజుల్లోనే దాదాపు 25% పెరిగింది. అమెరికా Treasury దీర్ఘకాలిక బాండ్లను ఎక్కువగా కొనుగోలు చేయబోతోందన్న వార్తలతో డాలర్ బలహీనపడొచ్చనే భయాలు పెరిగాయి. దీంతో కొందరు Investors Bitcoin, Gold వైపు మళ్లారు. మరోవైపు అమెరికాలో Cryptoకి సంబంధించి కొత్త, అనుకూలమైన రూల్స్ వస్తాయన్న అంచనాలు కూడా ఈ పెరుగుదలకు మరింత బలాన్నిచ్చాయి. దీంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడం Bitcoin ర్యాలీకి మరింత ఊపునిచ్చింది.

Stock Market మళ్లీ గ్రీన్‌లోకి..
ఉదయం మార్కెట్ కాస్త డల్‌గా కనిపించినా.. చివర్లో ఒక్కసారిగా పికప్ అయింది! 👀 Sensex 287 పాయింట్లు పెరిగి 77,656 దగ్గర క్లోజ్ అవ్వగా, Nifty 116 పాయింట్లు ఎగబాకి 24,335కు చేరింది. ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ ధరలు 3% పడిపోయి బ్యారెల్‌కు $90 కంటే దిగువకు రావడం. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ప్రభావం చమురు సరఫరాపై పెద్దగా ఉండకపోవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్‌కు కాస్త ఊరటనిచ్చాయి. రూపాయి బలపడటం, చివర్లో కొనుగోళ్లు పెరగడం కూడా కలిసొచ్చాయి.

లస్సీ అమ్మి ఇల్లు కట్టుకున్నాడు..! ❤️
రోజుకు ₹250 సంపాదించే స్థాయి నుంచి నెలకు ₹80,000 సంపాదించే లస్సీ వ్యాపారి వరకు.. ఢిల్లీలోని ఓ వ్యక్తి ప్రయాణం ఇప్పుడు చాలామందిని ఆకట్టుకుంటోంది. చిన్న వయసులోనే పని మొదలుపెట్టిన ఆయనకు ఒకప్పుడు సొంత ఇల్లు కూడా లేదు. కష్టపడి లస్సీ వ్యాపారం పెంచుకుంటూ వెళ్లడంతో ఆదాయం క్రమంగా పెరిగింది. ఇప్పుడు నెలకు సుమారు ₹80,000 సంపాదిస్తున్నానని, ఆ డబ్బుతో ఉత్తరప్రదేశ్‌లో తన కుటుంబం కోసం ఇల్లు కట్టుకున్నానని ఆయన చెబుతున్నారు. చిన్న వ్యాపారం అయినా.. ఏళ్ల పాటు పట్టుదలగా చేస్తే జీవితం ఎంత మారొచ్చో చెప్పే కథ ఇది.
Technology
See all →
పంది కిడ్నీతో 9 నెలలు జీవించిన వ్యక్తి
మనిషికి పంది కిడ్నీ.. అది కూడా జీన్ మార్పులు చేసినదైతే? అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూస్‌కు జీన్ ఎడిట్ చేసిన పంది కిడ్నీని అమర్చగా, అది 271 రోజులు పనిచేసింది. ఈ సమయంలో ఆయనకు డయాలసిస్ అవసరం లేకపోవడం విశేషం. తర్వాత పంది కిడ్నీని తొలగించి, మానవ దాత కిడ్నీని విజయవంతంగా అమర్చారు. ఈ కేసు అవయవాల కొరత ఉన్న రోగులకు పంది అవయవాలను తాత్కాలిక ‘బ్రిడ్జ్’గా ఉపయోగించే అవకాశాన్ని చూపిస్తోంది. అయితే ఇది ఒక్క కేసు మాత్రమే.. మరిన్ని పరీక్షలు అవసరం. భవిష్యత్తులో అవయవ మార్పిడికి ఇది కొత్త మార్గం చూపొచ్చు.

వేరే యాప్స్ ఎందుకు బాస్? వాట్సాప్‌లోనే అన్ని బిల్స్ క్లోజ్!
బిల్లులు కట్టడానికి ఇక పది యాప్‌లు వాడే అవసరం లేదు. Whatsapp కొత్త అప్డేట్తో గేమ్ మార్చేసింది. భారత్ కనెక్ట్ (BBPS)తో లింక్ అయ్యి కరెంట్, గ్యాస్, క్రెడిట్ కార్డ్, ఫాస్ట్‌ట్యాగ్ లాంటి 22 వేల పైచిలుకు బిల్లర్లను డైరెక్ట్‌గా చాట్ ప్లాట్‌ఫామ్‌పైకి తెచ్చింది. వాట్సాప్ ఓపెన్ చేసి పైన కనిపించే ‘₹’ సింబల్ నొక్కి, బిల్లర్ సెలెక్ట్ చేసి UPI లేదా కార్డులతో సెకన్లలో పేమెంట్ చేసేయొచ్చు. పాత హిస్టరీ, అప్‌కమింగ్ డ్యూస్ కూడా ఇక్కడే క్లియర్‌గా ట్రాక్ అయిపోతాయి.

ఏఐ టూత్ బ్రష్.. ధర రూ.47 వేలు!
దంతాలను శుభ్రం చేసేందుకు ‘ఏఐ టూత్ బ్రష్’ మార్కెట్లోకి వచ్చింది. డైసన్ సంస్థ రూపొందించిన CameraJet టూత్ బ్రష్‌లో 100కే పిక్సెల్ కెమెరా, ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని వాడారు. ఇది దంతాలను స్కాన్ చేస్తూ, క్లీన్ చేయాల్సిన ప్రాంతాలను గుర్తిస్తుంది. దీని ధర 499 డాలర్లు (సుమారు రూ.47 వేలు). ఇతర ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లతో పోలిస్తే ఇది 69 శాతం మెరుగ్గా దంతాలను శుభ్రం చేస్తుందని కంపెనీ తెలిపింది.

AI చేసిన ఆర్ట్‌కు కాపీరైట్ ఉంటుందా?
AIతో ఒక బొమ్మ తయారు చేయడం ఇప్పుడు పెద్ద విషయం కాదు.. కానీ ఆ బొమ్మ మీద కాపీరైట్ ఎవరిది? ఇదే ప్రశ్న భారత్‌లో ఓ కేసు ద్వారా ముందుకొచ్చింది. DABUS అనే AI సిస్టమ్ రూపొందించిన ‘A Recent Entrance to Paradise’ అనే ఆర్ట్‌వర్క్‌కు కాపీరైట్ కోరగా, భారత కాపీరైట్ కార్యాలయం AIని రచయితగా గుర్తించలేమని స్పష్టం చేసింది. ఆర్ట్ ఒరిజినల్‌గా ఉన్నా.. దాన్ని తయారు చేసిన AIకి చట్టపరమైన రచయిత హోదా ఉండదని తెలిపింది. AI ఆర్ట్ చేయగలదు.. కానీ దానికి చట్టపరమైన హక్కు దక్కాలంటే మనిషి పాత్ర ఎంత ఉండాలి? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.
Viral
See all →
రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!
ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో సందడి చేశారు. కోజికోడ్‌లో ఓ జ్యువెల్లరీ ఈవెంట్‌కు వచ్చిన ఆమె.. ఆ తర్వాత కేరళం CM వి.డి. సతీశన్‌ను కలిశారు. ఇక్కడ రొనాల్డోకు భారీ ఫ్యాన్ బేస్ ఉందని CM చెప్పగా, ఈ విషయం తనకు తెలియదని ఎల్మా అన్నారు. ఈ విషయాన్ని రొనాల్డోతో చెబుతానని చెప్పారు. చివర్లో ‘CM సార్.. ఒక్క ఫొటో ప్లీజ్’ అంటూ ఫొటో అడగడంతో ఈ మూమెంట్ వైరల్‌గా మారింది. తరువాత CMతో దిగిన ఫొటోలను ఎల్మా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. <a href="https://x.com/vdsatheesan/status/2095026237718806895?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2095026237718806895%7Ctwgr%5E0150c68c6d23d9ff94230cf5dcecf2cd9b6551b7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fcristiano-ronaldos-sister-elma-visits-kerala-smr-1554789.html">వీడియో లింక్</a>

అవ్వకు CM విజయ్ స్పెషల్ గిఫ్ట్.. వీడియో వైరల్!
తమిళనాడు CM విజయ్ సేలంలో ఓ వృద్ధురాలిని కలసి సర్ప్రైజ్ చేశారు. మేట్టూరు డ్యామ్ విజిట్ తర్వాత ఓ రైతు ఇంటి దగ్గర ఆగిన విజయ్.. చెల్లం అనే వృద్ధురాలితో కాసేపు మాట్లాడారు. ఆమె ఆరోగ్యం, భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. తరువాత తాను పెట్టుకున్న Dior సన్‌గ్లాసెస్‌ను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చారు. మొదట ఆమె ఫస్ట్‌లో తీసుకోడానికి మొహమాటపడినా విజయ్ స్వయంగా ఆమెకు పెట్టారు. ఈ క్యూట్ మూమెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రైల్లో ఇండియన్స్ హంగామా.. టూరిస్టులపై కామెంట్స్!
జర్మనీలో ఫుల్ రష్‌గా ఉన్న ఓ రైల్లో కొందరు గుజరాతి ఇండియన్ టూరిస్టులు గట్టిగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ హంగామా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యూజర్ ఈ వీడియోను <a href="https://x.com/Amit24TD/status/2094429195527196793?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2094429195527196793%7Ctwgr%5Ea95b9a92608886003674bc8a8ac30d78b1151367%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fprathyekam%2Fgermany-train-viral-video-indian-tourists-singing-clapping-sparks-outrage-bsb-1554431.html">'ఎక్స్'లో</a> పోస్ట్ చేశారు. రైల్లోని ఇతర టూరిస్టులను సైలెంట్‌గా ఉండగా.. ఇండియన్స్ చేసిన హంగామాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విదేశాల్లో ఇలాంటి వారి బిహేవియర్‌తో ఇండియన్ టూరిస్టులపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని కామెంట్లు చేస్తున్నారు.

డ్రైవర్‌లెస్ కార్.. డైరెక్ట్‌గా పోలీస్ వ్యాన్‌కు ఢీ!
పాకిస్థాన్‌లో డ్రైవర్‌లెస్ కార్ డెమో కాస్తా మిస్‌ఫైర్‌గా మారింది. పార్క్ చేసి ఉన్న పోలీస్ వ్యాన్‌ను కారు ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డీ-చౌక్ దగ్గర జరిగిన ఈ డెమోలో జర్నలిస్ట్ ముహమ్మద్ ఆలిజా కారులోనే ఉండి వీడియో రికార్డ్ చేశారు. కారు రిమోట్‌గా ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్‌తో ఆపరేట్ చేస్తున్న టైమ్‌లో కనెక్షన్లో ప్రాబ్లమ్ రావడంతో కంట్రోల్ తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కొంత నష్టం జరగగా, ఎవరికీ గాయాలు కాలేదు.























































































