పగటి వెలుగుల్లోనూ లైట్లు.. ఇది వ్యర్థమే!

పల్నాడు దాచేపల్లి డివైడర్ల మీద స్ట్రీట్ లైట్లు – పగలు కూడా వెలుగుతున్నాయి! సాయంత్రం ఆన్ చేసి ఉదయం ఆఫ్ చేయకపోవడమే కారణం. సూర్యుడు వచ్చేసినా లైట్లు మాత్రం ఆగట్లేదు – ఇది విద్యుత్ వృథా, ప్రజా డబ్బుకు భారం. "ఇలా పావు రోజు లైట్లు వెలిగిస్తే, పంచాయతీ కరెంట్ బిల్లు పెరిగి చివరికి మనమే కట్టుకోవాల్సి వస్తుంది" అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం డబ్బు వృథా మాత్రమే కాదు – పగటి వేళ లైట్లు వెలిగిస్తే ఆ ఎక్స్ట్రా లోడ్ పడి ఇళ్లల్లో TVలు, ఫ్రిజ్లు, ఫ్యాన్లు కాలిపోయే ప్రమాదమూ ఉందంటున్నారు.

