← Back to news

మోడల్ మార్కెట్ కు మోక్షం ఎప్పుడు..?

By Adithya D· 29 Aug 2026
మోడల్ మార్కెట్ కు మోక్షం ఎప్పుడు..?

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో 2020లో ప్రారంభమైన మోడల్ మార్కెట్ నిర్మాణం నేటికీ పూర్తికాకపోవడంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయలు, మాంసం, పండ్ల విక్రయాలను ఒకే చోట నిర్వహించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం మారిన తర్వాత పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో వ్యాపారులు రోడ్లపైనే కూరగాయలు, మాంసం విక్రయిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

More in Local