పిల్లల హక్కుల రక్షణకు అందరూ కలవాలి! 👶

AP : తాడేపల్లి డోలాస్‌నగర్‌లో గుడ్ షెఫర్డ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. చైల్డ్ మ్యారేజెస్, స్కూల్ డ్రాపౌట్స్, సెక్షువల్ హరాస్‌మెంట్స్ ఆపడానికి గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్స్, ఎన్జీవోలు, పేరెంట్స్, మీడియా కలిసి పనిచేయాలని సంస్థ మేనేజర్ షాలిని చెప్పారు. గ్రామ స్థాయిలో సమస్యలను ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవాలని, బాధితులైన పిల్లల పర్సనల్ డిటైల్స్ గోప్యంగా ఉంచాలని మీడియాను కోరారు.

