అసైన్డ్ భూమిలో రోడ్డు.. చర్యలకు డిమాండ్!

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పీర్ల తాండలో అసైన్డ్ భూమిలో అక్రమ రోడ్డు నిర్మాణం వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్ 120/50/4/Aలో అధికార అనుమతులు లేకుండా సుమారు 40 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారని BSP నారాయణఖేడ్ ఇంచార్జి అనుముల, తుకారాం ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పట్టాదారు ఆక్షేపణ లేదన్నా, నిబంధనలకు విరుద్ధంగా పనులు సాగడం ఆందోళనకరమన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తుకారాం డిమాండ్ చేశారు.

