మహాధర్నాకు భారీగా తరలిన నల్లబెల్లి టీచర్లు

TG: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన ఉపాధ్యాయులు పీఆర్‌టీయూ-టీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహాధర్నాకు తరలివెళ్లారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీని తక్షణమే అమలుచేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాలో పాల్గొనేందుకు నల్లబెల్లి మండలం నుంచి ఉపాధ్యాయులు తరలివెళ్లారు.

