విద్యుత్ అమరవీరులకు ఘన నివాళి

AP: విద్యుత్ అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజాసమస్యలపై ఐక్యంగా పోరాడాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. విశాఖపట్నం అక్కయ్యపాలెంలోని ఏఎస్‌ఆర్ నగర్‌లో విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సంస్మరణ సభ నిర్వహించారు. 2000 ఆగస్టు 28న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో మృతిచెందిన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసిందని నాయకులు పేర్కొన్నారు.

