ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణానికి సెప్టెంబర్ 13న శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయత్‌లోని ఐదు ఎకరాల స్థలంలో నిర్మించనున్న భవన నిర్మాణానికి సెప్టెంబర్ 13న శంకుస్థాపన నిర్వహించనున్నారు. శంకుస్థాపనకు రావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డిని ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు కలిశారు. సీఎం అందుకు అంగీకరించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, ఉప్పల్ భగాయత్ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు పాల్గొన్నారు.


