ఇక రామేశ్వరం పల్లి PACS కొత్త చైర్మన్ ఇంద్రకరణ్ రెడ్డి

రామేశ్వరం పల్లి PACS కొత్త పాలకవర్గం ప్రమాణం చేసింది. కామారెడ్డి జిల్లాలో శనివారం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బద్దం ఇంద్రకరణ్ రెడ్డి నూతన చైర్మన్‌గా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ – కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కొత్త చైర్మన్ మాట్లాడుతూ "రైతు బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుంది. వ్యవసాయ రంగానికి అన్ని విధాలా సేవ చేస్తా" అని చెప్పారు.

