గుత్తిలో పల్లె ఉమా స్మృతిలో ఘన నివాళి!

అనంతపురం గుత్తి శ్రీ సాయి క్యాంపస్‌లో ఆదివారం పల్లె ఉమా 8వ వర్ధంతి నివాళి కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వెంకటేశ్వర్లు రెడ్డి, PRR MBA కళాశాల ప్రిన్సిపాల్ డా. ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో డా. సింధూర చేతుల మీదుగా రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాళ్లు మాట్లాడుతూ – "పల్లె ఉమా స్ఫూర్తితో ముందుకు సాగాలి. నేటి సమాజంలో బలమైన ఆయుధం విద్య, బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి" అని పిలుపునిచ్చారు.



