తెలంగాణ అసెంబ్లీ సమావేశాల డేట్ ఫిక్స్!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. మూడో శాసనసభ 8వ సెషన్‌లో భాగంగా రెండో మీటింగ్ సెప్టెంబర్ 7, 2026న ఉదయం 10AMకు జరగనుంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్‌లో ఈ సెషన్ నిర్వహిస్తున్నట్లు లెజిస్లేచర్ సెక్రటరీ రెండ్ల తిరుపతి అధికారికంగా MLAలందరికీ సమాచారం అందించారు. స్పీకర్ ఆర్డర్ మేరకు MLAలందరూ ఈ మీటింగ్‌కు కచ్చితంగా అటెండ్ కావాలని నోటీస్‌లో స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ మళ్లీ రీఓపెన్ కాబోతోంది.

