విజయవాడ–తిరుపతి మధ్య త్వరలో ఫ్లైట్!

విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు త్వరలో విమాన ప్రయాణం మరింత ఈజీ కానుంది. విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతికి ఫ్లైట్ సర్వీసును ప్రారంభించనున్నట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఉదయం వేళల్లో FLY91 ఈ సర్వీసును నడపనుంది. టెర్మినల్ పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేసి, సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి రోజుకు 22 సర్వీసులు నడుస్తున్నాయి. మరి ఈ సర్వీసు భక్తుల ప్రయాణాన్ని ఎంతవరకు సులభం చేస్తుందో చూడాలి.



