రాఖీ వేడుకల్లో గంప గోవర్ధన్

TG: కామారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రాఖీ పౌర్ణమి వేడుకలను తన అక్కలతో కలిసి ఆత్మీయంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అక్కలు సుగుణ, ప్రమీల, విమల గంప గోవర్ధన్‌కు రాఖీలు కట్టారు. అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలను పంచుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కల నుంచి రాఖీలు కట్టించుకున్న గంప గోవర్ధన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

