కాల్ వస్తే టెన్షన్.. మెసేజ్ వస్తే మాత్రం ఈజీ!

ఫోన్ మోగగానే ఎత్తేయాలంటే చాలామందికి చిన్న టెన్షన్.. కానీ అదే విషయం మెసేజ్‌లో వస్తే ఈజీగా అనిపిస్తుంది! టెక్స్ట్‌లో సమాధానం ఆలోచించుకునే టైమ్ ఉంటుంది; వెంటనే స్పందించాల్సిన ఒత్తిడి ఉండదు. ఎదుటివారి గొంతు టోన్, మౌనం, ఇబ్బందికరమైన సైలెన్స్‌ను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. రోజంతా నోటిఫికేషన్స్, రీల్స్, మెసేజెస్‌తో ఉండే Gen-Zకి సంభాషణ తమ కంట్రోల్‌లో ఉండటం కంఫర్ట్‌గా అనిపించొచ్చు. అందుకే కాల్ చేయడం కంటే టెక్స్ట్ పంపడం సేఫ్‌గా ఫీల్ అవుతుంది. ఇది కాల్స్ అంటే భయమని కాదు.. కమ్యూనికేషన్ విధానం మారింది.


