ట్రైబల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

TG: ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ(SSCTU)లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొఫెసర్ జి.రాంరెడ్డి తెలిపారు. 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ హైదరాబాద్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో కొత్త అకడమిక్ ప్రోగ్రామ్స్ ప్రారంభించనున్నారు. జూన్ 21 లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇతర వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.ssctu.ac.inను సందర్శించవచ్చని రాంరెడ్డి తెలిపారు.



