తెలంగాణలో క్రమంగా విస్తరిస్తున్న రుతుపవనాలు

తెలంగాణలో క్రమంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. అయితే రాష్ట్రమంతా వ్యాపించకపోవడంతో ఎండల ప్రభావం కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణలో ఎండలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, హనుమకొండలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రుతుపవనాలు పూర్తిగా విస్తరించేందుకు మరో 2-3 రోజుల సమయం పడుతుందని వాతావరణ అధికారులు అంటున్నారు.



