← Back to news

బ్రేకప్ చెప్పిందని ఆఫీస్ లోనే చంపేశాడు!

By sahani· 5 Jun 2026· X· Punjab

పంజాబ్‌లోని మొహాలీలో ఒక షాకింగ్ మర్డర్ జరిగింది. ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్న డింపిల్ (30), హర్జిందర్ సింగ్ (39) మూడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. రీసెంట్‌గా డింపిల్ అతనికి బ్రేకప్ చెప్పి. తనను కలవద్దని వార్నింగ్ ఇచ్చింది. దీన్ని తట్టుకోలేని హర్జిందర్, అందరూ చూస్తుండగానే ఆఫీసులోనే ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత అదే కత్తితో తను కూడా పొడుచుకుని ఆత్మహత్యకు ట్రై చేశాడు. ప్రజెంట్ అతను క్రిటికల్ కండిషన్‌లో హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈ ఘోరానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.