← Back to news

రైతు భరోసా నిధుల విడుదల

By DK· 17 Jun 2026· Samayam· హైదరాబాద్‌
రైతు భరోసా నిధుల విడుదల

TG: తెలంగాణలో వానాకాలం సీజన్‌కు గానూ రైతుభరోసా నిధుల విడుదలకు CM రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రైతు భరోసా పథకం నిధుల విడుదలకు తక్షణమే సన్నాహాలు చేయాలని వ్యవసాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులను CM ఆదేశించారు. ఈ పథకం కింద ఎకరానికి రూ.6వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికి గానూ మొత్తం రూ.9 వేల కోట్లను విడుదల చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించగా, సీఎం దానికి సానుకూలంగా స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 26న తొలి విడతగా 73 లక్షల మంది రైతులకు నిధులు జమ కానున్నాయి.

More in TG