మధ్యప్రదేశ్‌లో పిల్లాడితో సేవ చేపించుకుంటున్న టీచర్!
మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలి అమానుష ప్రవర్తన వెలుగుచూసింది. ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని కబుర్లలో మునిగిపోయిన ఆమె, ఒక చిన్న పిల్లాడితో తనకు విసనకర్రతో విసిరించుకుంటుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్య నేర్పాల్సిన వారే ఇలాంటి పనులకు పాల్పడటంపై నెటిజన్లు విద్యాశాఖ అధికారుల తీరును తప్పుబడుతూ, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



