ACBకి పట్టుబడిన DSP కేసులో కొత్త ట్విస్ట్

TG: ACBకి పట్టుబడ్డ DSP భీమ్‌రెడ్డికి చెందిన సుమారు రూ.200 కోట్ల ఆస్తుల వ్యవహారంపై ED, IT శాఖలు దృష్టిపెట్టాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భీమ్‌రెడ్డి భారీగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు, కేసు ఫైళ్ల కాపీలను తమకు అందజేయాలని ACBని ED అధికారులు కోరారు. ఏసీబీ గుర్తించిన 18 స్థిరాస్తుల్లో 75శాతం బినామీల పేరిటే ఉన్నాయని తేలింది. మరోవైపు DSP భీమ్‌రెడ్డిని అరెస్టు చేయకుండా వదిలిపెట్టడంపై పోలీసుశాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన అస్వస్థతకు గురవడంతో వైద్యపరీక్షలు చేయించి వదిలిపెట్టామని, విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చామని ACB అధికారులు తెలిపారు.



