తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో గాయపడ్డ 60 మంది కార్మికులు!

తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాలో ఒక టపాసుల తయారీ కేంద్రంలో మంటలు అంటుకున్నాయి. అక్కడ ఉన్న టపాసుల సామాగ్రి ఒక్కసారిగా పేలడంతో ఐదు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన టైమ్ లో లోపల 60 మంది కార్మికులు ఉన్నారు. వారిలో చాలా మందికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పి, చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇంన్సిడెంట్ లో ఎవరైనా చనిపోయారా, లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.



