తమిళనాడులో జార్ఖండ్ గిరిజనులపై దాడులు !!

తమిళనాడులోని నామక్కల్‌లో గల ఒక టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో వేధింపులు తాళలేక జార్ఖండ్‌కు చెందిన సుమారు 100 మంది ఆదివాసీ కార్మికులు సొంతూళ్లకు తిరిగి వెళ్లిపోయారు. తమకు వేతనాలు చెల్లించలేదని, సరైన ఫుడ్ కూడా ఇవ్వకపోగా, తీవ్రంగా కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ వదిలి వెళ్తామంటే తమను బెదిరించారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పందించి విచారణకు ఆదేశించారు.



