SIRతో అద్దె ఇంట్లో ఉండే వాళ్లలో టెన్షన్

TG: బతుకుదెరువు కోసం పట్టణాలు, నగరాలకు వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్న ప్రజలకు ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) భయం పట్టుకుంది. గతంలో ఒక ఇంట్లో అద్దెకు ఉండి అక్కడే ఓటు పొందినవారు. ఇప్పుడు ఆ చిరునామాలో లేకుంటే తమ ఓటు తీసేస్తారా? అనే డౌట్‌తో టెన్షన్ పడుతున్నారు. కొత్త ఇంటి అడ్రస్‌కు సంబంధించిన రుజువుపత్రాలు లేకుంటే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. అద్దెకు ఉంటున్నవారికి ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. తమ నివాసాన్ని నిర్ధారించే ఆధారాలు సమర్పించాలి. అడ్రస్ ఫ్రూప్ లేకపోతే BLOలు విచారణ చేసి నిర్ధారిస్తారు.



