ఆరుగురి హత్య ఘటన.. SI రమేష్ సస్పెండ్

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్య ఘటన బాధిత కుటుంబసభ్యులను ఎమ్మెల్యే కాలే యాదయ్య, కలెక్టర్ నారాయణరెడ్డి పరామర్శించారు. ఘటనతో అనాథగా మిగిలిన మానసిక వికలాంగురాలికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న SI రమేష్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇతర పోలీసు సిబ్బందిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.



