← Back to news

UPIపై ఎఫెక్ట్.. క్యూఆర్‌ బోర్డులు తొలగింపు

By Bala· 17h ago· X

24 గంటలు కూడా గడవకముందే UPI చెల్లింపులపై ప్రభావం కనిపిస్తోందన్న చర్చ మొదలైంది. కొందరు దుకాణదారులు UPI క్యూఆర్‌ బోర్డులను తొలగిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులపై ఆధారపడిన చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బోర్డులు తొలగించడంతో కస్టమర్లకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.

More in Viral

అంబానీ ఇంట గణేశ్ వేడుకలు.. టిఫనీ ట్రంప్ స్పెషల్ అట్రాక్షన్!
Viral· 6h ago

అంబానీ ఇంట గణేశ్ వేడుకలు.. టిఫనీ ట్రంప్ స్పెషల్ అట్రాక్షన్!

ముఖేశ్ అంబానీ ఇంట యాంటీలియాలో జరిగిన వినాయక చవితి, గణేశ్ నిమజ్జన వేడుకల్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫనీ ట్రంప్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. భర్త మైఖేల్ బూలోస్, తల్లి మార్లా, కొడుకు అలెగ్జాండర్‌తో కలిసి ఆమె వేడుకల్లో పాల్గొన్నారు. ఇండియన్ ట్రెడిషనల్ లుక్‌లో టిఫనీ ఆకట్టుకున్నారు. డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన పిస్టాచియో-గ్రీన్ లెహెంగా, పింక్ దుపట్టాతో పాటు పోల్కీ జువెలరీతో మెరిశారు. ఈ వేడుకల ఫొటోలను ఆమె <a href="https://www.instagram.com/p/DdWw7lwmzw9/?img_index=1">ఇన్‌స్టాగ్రామ్‌లో</a> షేర్ చేశారు.