ఐఫోన్ కొనివ్వలేదని నానమ్మపై దాడి!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్‌లో దారుణ ఘటన జరిగింది. ఐఫోన్ కొనివ్వడంతో పాటు ఖర్చుల కోసం 3 లక్షల రూపాయలు ఇవ్వాలని నానమ్మను మనవడు అడిగాడు. తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో ఆమెపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన అత్తను కూడా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఖరీదైన బైక్ కొనిచ్చినా.. ఫోన్, డబ్బు కోసం కొట్టాడాని ఆమె (నానమ్మ) పోలీసులకు కంప్లైంట్ చేసింది. మనవడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమకు ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరింది. <a href="https://x.com/pulsenewsbreak/status/2100193231170589035?s=20">వీడియో లింక్</a>



