రామ మందిరం, పార్లమెంట్ టార్గెట్? నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్!

ఢిల్లీ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి IED బాంబు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, రామ మందిరం మరియు పార్లమెంట్ హౌస్ వంటి ప్రముఖ కట్టడాలే లక్ష్యంగా వీరు దాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా నెట్‌వర్క్ పెంచుకుంటూ, కీలక ప్రాంతాల్లో నిఘా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.



