← Back to news

అనంతపురం జిల్లాలో పోలీసుల అరాచకం..

By sahani· 21 Apr 2026· X· Ananthapuram District

అనంతపురం జిల్లా పెదవడుగూరులో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. పోలీస్ స్టేషన్ ముందు ఒక ఎస్సి దళిత యువకుడిని SI దారుణంగా కొట్టారు. రాజకీయ నాయకులను సంతోషపెట్టడానికే పోలీసులు ఇలా అమాయకులను వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే ఇలా నేరుగా శిక్షలు విధిస్తే, ఇక కోర్టులు మరియు చట్టాలు ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భారీగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.