భార్య కోరిక తీర్చలేక హత్య చేసి తాను సూసైడ్

TG: భర్త భార్యకు ఉరి వేసి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో చోటు చేసుకుంది. దాసరి అంజయ్య(25), యాదమ్మ(20)లకు రీసెంట్‌గా వివాహం జరిగింది. బైక్ కొనివ్వాలన్న భార్య కోరిక తీర్చలేక, ఆమెతో గొడవపడి మామిడి తోటలో భార్య యాదమ్మకు ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తాను ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



