మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీవీకే నేతపై పోక్సో కేసు

చెన్నైలో దారుణం జరిగింది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి చెందిన దినేష్ అలియాస్ 'పాము' దినేష్ అనే నేత ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రాయపురం మహిళా పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పరారీలో ఉన్న దినేష్‌ను ప్రత్యేక బృందం పట్టుకుంది.



