పాకిస్తాన్ లో సూసైడ్ బాంబింగ్!
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. క్వెట్టాలో సైనికులతో వెళ్తున్న రైలుపై సూసైడ్ కారు బాంబు దాడి జరగడంతో కనీసం 24 మంది మరణించగా, 70 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి రైలు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ దారుణానికి బాధ్యత వహించింది. గాయాలైన వాళ్ళని ఆస్పత్రులకు తరలించగా, చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



