AP లోని ధర్మవరంలో ATM దోపిడీ!
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బుధవారం తెల్లవారుజామున ముగ్గురు ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఏటీఎంను ఇనుప రాడ్లతో పగలగొట్టడానికి ప్రయత్నించి, విఫలమవ్వడంతో వినూత్నంగా ఆలోచించారు. ఏటీఎం మిషన్ కు తాళ్లు కట్టి, బొలెరో వాహనంతో లాక్కెళ్లిపోయారు. నిందితులు బత్తలపల్లి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వింత చోరీ స్థానికంగా కలకలం రేపింది.



