విద్యార్థి సంఘాల ఆందోళన

TG: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా KG టు PG విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. SFI, AISFI, PDSU, AIDSO, AIFDS, AISB, AIPSU విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వ విద్యను బాగుచేస్తామని చెప్పి 23వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.



