9 ఏళ్లలో 400 రోజులు బయటే.. జైలు నుంచి బయటకొచ్చిన డేరా బాబా!

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు టైమ్ అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా హెడ్ గుర్మీత్ రామ్ రహీమ్ మరోసారి 30 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చారు. హరియాణాలోని సునారియా జైలు నుంచి ఆయన మంగళవారం రిలీజ్ అయ్యారు. 2017లో జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆయనకు పెరోల్ రావడం ఇది 16వ సారి. ఈ 9 ఏళ్లలో ఆయన 400 రోజులకు పైగా జైలు బయటే గడపడం ప్రెసెంట్ దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్‌గా మారింది.



