← Back to news

బంగారం దొరికిన పొలంపై కొత్త ట్విస్ట్

By DK· 30 Jun 2026· వరంగల్ జిల్లా
బంగారం దొరికిన పొలంపై కొత్త ట్విస్ట్

TG: వరంగల్ జిల్లా కోపాకులపాడులోని వ్యవసాయ భూమిలో బంగారు నగలు దొరకడం హాట్ టాఫిక్‌గా మారింది. ఈ భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకు చెందిన ఓ వ్యక్తి, కోపాకులపాడుకి చెందిన రైతు నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భూమిని ఈర్యతండాకు చెందిన ఒక రైతు కౌలుకు తీసుకుని పత్తిసాగు చేస్తున్నాడు. గతంలో ఇక్కడ గుప్తనిధులు లభ్యమైనట్లు స్థానికులు చెపుతున్నారు. గతంలో ఈ భూమిని విక్రయించిన పాత యజమాని కుమారుడు PSలో ఫిర్యాదు చేశారు. తమ తాతలకాలం నాటి భూమిలో దొరికిన బంగారాన్ని తమకు అప్పగించాలని కోరారు. ప్రస్తుత యజమాని కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.

More in TG