ప్రమాదకరంగా RDS ఆనకట్ట.. పనులు గుర్తించాలి: రేవంత్ రెడ్డి

TG: తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి.. భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని CM రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో TG, AP, కర్ణాటక నీటి వాటాల సమర్థ వినియోగానికి తుంగభద్ర బోర్డును పటిష్ఠం చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, RDS, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై CM సమీక్ష నిర్వహించారు. RDS(రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనులను గుర్తించాలని కోరారు.



