కమర్షియల్ టాక్సెస్ శాఖ అటెండర్ ఇంట్లో కోట్లాది ఆస్తులు !!

విజయవాడలో వాణిజ్య పన్నుల శాఖ అటెండర్ కొండపల్లి శ్రీనివాసరావుపై ACB కేసు నమోదైంది. ఆతని ఇల్లు, సోదరుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నట్లు అధికారులు నిర్ధారించారు..760 గ్రాముల బంగారం,5 గోల్డ్ బిస్కెట్లు,7.8 కిలోల వెండి ఆభరణాలు సీజ్ చేశారు. బ్యాంక్ ఖాతాల్లో రూ.22 లక్షల క్యాష్ ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావు పేరిట .ఖరీదైన బంగ్లా,, స్థలం ఉన్నట్లు బయటపడ్డాయి..బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ACB అధికారులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.



