అడ్డొస్తున్నాడని హత్య చేసి డ్రామా, విచారణలో బిగ్ ట్విస్ట్

AP: ప్రియుడి మోజులో పడి కన్న కొడుకును మర్డర్ చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం జీ.హోసళ్లి విలేజ్‌లో చోటుచేసుకుంది. గంగమ్మ అనే మహిళ దర్గప్పతో ఉన్న వివాహేతర సంబంధాన్ని ఆమె కుమారుడు నిలదీశాడు. దీంతో లవర్‌తో కలిసి గంగమ్మ కన్నకొడుకు వీరేంద్ర(15)ను కత్తితో పొడిచి చంపి డెడ్‌బాడీని స్మశానవాటికలో పాతిపెట్టింది. తన కుమారుడు కన్పించడంలేదని ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏకంగా దర్యాప్తు లేటు అవుతుందని హైకోర్టును ఆశ్రయించింది. పోలీసుల విచారణలో నిజం బయటపడింది. తీవ్ర అనారోగ్యానికి గురైన నిందితురాలు కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.



