డిజిటల్ డీటాక్స్‌కు కొత్త ఛాలెంజ్.. ‘Monk Mode’!

ఫోన్ వాడకాన్ని తగ్గించి, డిజిటల్ డీటాక్స్ చేయాలనుకునేవారి కోసం ‘Monk Mode’ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. వారం పాటు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌కు దూరంగా ఉండాలి. పోస్టులు, స్టేటస్‌లు పెట్టకూడదు. ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా, రాత్రి త్వరగా నిద్రపోవాలి. జంక్‌ఫుడ్, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, గేమ్స్‌కు దూరంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఫోన్ వాడకూడదు. రోజూ 45–60 నిమిషాలు వ్యాయామం చేయాలి. దీనివల్ల ఏకాగ్రత, సెల్ఫ్ కంట్రోల్ పెరిగి ఒత్తిడి తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.



