చిన్న నిర్లక్ష్యం.. క్షణాల్లో పెను ప్రమాదం
TG: క్షణకాలపు అజాగ్రత్త జీవితకాలపు ఆవేదనకు దారితీస్తుందనడానికి ఈ CCTV దృశ్యాలే సజీవ సాక్ష్యం. వాహనం ఆపి, ఇంజిన్ రన్ అవుతుండగానే పిల్లలను దానిపై వదిలేయడం లేదా వారు పక్కనే ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. వాహనం స్టార్ట్ చేసి ఉన్నప్పుడు వారు తెలియక చేసే ఆ చిన్న పొరపాటే క్షణాల్లో ఊహించని ప్రమాదంగా మారి ప్రాణాల మీదికి తెస్తుంది. అందుకు కనీస జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని హైదరాబాద్ CP వీసీ సజ్జనార్ ఈ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అవగాహన కల్పించారు.



