← Back to news

పడవ బోల్తా.. తొమ్మిది మంది భక్తులు మృతి!

By sahani· 10 Apr 2026· Telugu Report· Uttar pradesh
పడవ బోల్తా.. తొమ్మిది మంది భక్తులు మృతి!

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో భక్తులతో వెళ్తున్న పడవ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఢీకొని బోల్తా పడటంతో తొమ్మిది మంది మృతి చెందారు. లూథియానాకు చెందిన యాత్రికులు కేసీ ఘాట్ సమీపంలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సహాయక బృందాలు 17 మందిని రక్షించగా, మరికొందరు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.