మర్రి జనార్దన్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరి

TG: నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరి ఇందిర చేత రాఖీ కట్టించుకుని అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆయనకు సోదరి ఇందిర రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలకు రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ పవిత్ర పండుగను ప్రజలంతా సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

