యువతిపై అత్యాచారయత్నం.. రక్షించిన వీధి కుక్క!
తమిళనాడులోని కోయంబత్తూర్ తుడియాలూర్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఒక యువతిపై దారుణం జరిగింది. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఓ యువకుడు అటాక్ చేసి లైంగిక దాడికి ట్రై చేశాడు. అక్కడే ఉన్న రెండు వీధి కుక్కలు వెంటనే అలర్ట్ అయ్యి, ఆ యువకుడిపైకి గట్టిగా మొరుగుతూ దాడి చేశాయి. దీంతో భయపడిపోయిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్ సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఈ వార్త బయటకు వచ్చింది.



