← Back to news

గురుకులంలో ఫుడ్ పాయిజన్

By DK· 9 Jul 2026· నాగర్ కర్నూల్ జిల్లా
గురుకులంలో ఫుడ్ పాయిజన్

TG: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఉదయం కిచిడి తిన్నవారిలో 26మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గురుకుల సిబ్బంది స్టూడెంట్స్‌ను చికిత్స నిమిత్తం అచ్చంపేట గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు. కాగా, గురుకులంలో సిబ్బంది తాగునీరు సరిగ్గా ఇవ్వడం లేదని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు.

More in TG