రీల్ లైఫ్ లో నటుడు.. రియల్ లైఫ్ లో క్రిమినల్ - ఇదో క్రైమ్ థ్రిల్లర్

బాలీవుడ్ స్టోరీని మించిన ట్విస్ట్ లున్న ఒక రియల్ స్టోరీ ఇది. 2005లో అహ్మదాబాద్‌లో జరిగిన ఒక గొడవ, హత్య కేసులో హేమంత్ మోదీ అనే వ్యక్తికి కోర్టు జీవితఖైదు విధించింది. 2014లో పరోల్‌పై బయటకు వచ్చిన అతడు.. తిరిగి జైలుకు వెళ్లకుండా పరారయ్యాడు. సీన్ కట్ చేస్తే… ముంబై చేరి పేరు మార్చుకుని బాలీవుడ్‌లో సెటిల్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’, రణ్‌వీర్ సింగ్ ‘జయేష్ భాయ్ జోర్దార్’ లాంటి క్రేజీ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. అయినా పోలీసులు అతనిని గుర్తించలేకపోయారు. 12 ఏళ్ల తర్వాత పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.



