← Back to news

ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు బాలిక ఆత్మహత్య!

By kamepallysahani015 kamepallysahani015· 10 Apr 2026· Telugu Report· Hyderabad
ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు బాలిక ఆత్మహత్య!

హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో పదో తరగతి బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. తోటి విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా లైంగికంగా వేధించడంతో మనస్తాపం చెందిన బాలిక ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు అడ్డుకుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, సోషల్ మీడియా చాటింగ్ వివరాలను విశ్లేషిస్తున్నారు. పిల్లల ఫోన్ల వాడకంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.